SVP: “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండే రిలీజ్ అయినా కళావతి, పెన్నీ సాంగ్ లు రెండూ కూడా సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే.
యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్.. మాత్రమే కాదు లైకులు కూడా భారీ స్థాయిలో ఈ రెండు పాటలు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబట్టాయి. ట్రెండింగ్ పరంగా కూడా ఈ రెండు పాటలు అనేక రికార్డులు సృష్టించడం మనం చూశాం. ముఖ్యంగా కళావతి సాంగ్ బాణీలు దానికి తగ్గట్టు మహేష్ డాన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుండి మూడవ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయడానికి సినిమా ముహూర్తం ఫిక్స్ చేసింది.
పూర్తి విషయంలోకి వెళితే ఉగాది కానుకగా ఈ సినిమా నుండి మూడవ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. కుదిరితే ట్రైలర్ కూడా రిలీజ్ చేయటానికి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే మే 12వ తారీకున ఈ సినిమా రిలీజ్ కాబట్టి ఉగాది పండుగకు “సర్కారు వారి పాట” నుండి రెండు సర్ప్రైస్ లు అభిమానులకు ఇస్తే ప్రీ పబ్లిసిటీ బావుటుందని మేకర్స్ ప్లాన్ అని టాక్. ఇక ఇదే సమయంలో వేసవి కానుకగా వస్తున్న ఈ సినిమా.. ప్రమోషన్ కార్యక్రమాలు ఏప్రిల్ నెల చివరాఖరి నుండి మొదలుపెట్టే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఈ సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేసి ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ప్రారంభించే ఆలోచనలో మహేష్ ఉన్నాడు.