Bhagavanth Kesari: తెలుగు చలనచిత్ర రంగంలో వయసున్న కుర్ర హీరోలు బాలయ్య స్పీడు అందుకోలేకపోతున్నారు. ఒకపక్క రాజకీయాలలో ఉన్నాగాని సినిమా రంగంలో దూసుకుపోతూ ఉన్నారు. వరుస పెట్టి విజయాలు అందుకుంటూ ఉన్నారు. యాక్షన్ ఎమోషన్స్ సినిమాలు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ రకంగానే అఖండ, నరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు దసరా పండుగకు ‘భగవంత్ కేసరి’తో బరిలోకి దిగిపోతున్నారు. ఒక విధంగా ఈ సినిమా కూడా యాక్షన్ ఎమోషన్ తరహాలోనే తీయడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తండ్రీకూతుళ్ళ నేపథ్యంలో చిత్రీకరించారు.
నేలకొండ భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా కుర్ర హీరోయిన్ శ్రీ లీల నటించింది. ఈనెల 19వ తారీకు విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ అందించడం జరిగింది. 163 నిమిషాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో ఎన్నో సర్ప్రైజెస్ ఇవ్వటం జరిగింది. గతంలో వచ్చిన రెండు సినిమాలు ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఉండటంతో అవి విజయం సాధించటంతో కచ్చితంగా ‘భగవంత్ కేసరి’తో అదే తరహాలో విజయం సాధించి హ్యాట్రిక్ బాలయ్య అందుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
పైగా బాలకృష్ణకి దసరా పండుగ బాగా కలిసి వచ్చే సీజన్ కావడంతో ఆయన అభిమానులు కూడా.. ఈ సినిమా విజయం పట్ల ధీమాగా ఉన్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. పెళ్లయి ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కాజల్ నటించడం జరిగింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపల్ సినిమాలో విలన్ పాత్రలో నటించడం జరిగింది.