Bheemla nayak: ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ మాట్లాడుకుంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటించిన భీమ్లానాయక్ సినిమా గురించే. పలువాయిదాల తరువాత తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్ఠిస్తోంది. దాదాపు రెండేళ్ళ తర్వాత ఈ రేంజ్ సునామీ బాక్సాఫీస్ వద్ద కనిపించింది. థమన్ మ్యూజిక్కు థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి అనే పదం కూడా చిన్నదే అని చెప్పాలి. వకీల్ సాబ్ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న పవన్ ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాతో మాంచి మాస్ హిట్ అందుకున్నారు. రానా పాత్ర సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పక తప్పదు.
అయితే, భీమ్లానాయక్ ఇంత పెద్ద హిట్ అవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒరిజినల్ కథలో ఉన్న పాత్రలు ఇక్కడ మార్చారు. అక్కడ విలన్ ఇక్కడ హీరో అలాగే అక్కడ హీరో ఇక్కడ విలన్. ఇదే పాయింట్ భీమ్లానాయక్ సినిమాకు బాగా కలిసి వచ్చిన అంశం. ఇక నిత్యా మీనన్ ..పవన్ రానా పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అంతా ఇచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద హైలెట్‌గా నిలిచింది. వకీల్ సాబ్ సినిమా కథను ఎలా అయితే పవన్ ఇమేజ్‌కు మార్చి తీశారో..ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాను కూడా అలాగే పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి తీయడం కలిసొచ్చిన అంశాలలో ఒకటి.
Bheemla nayak: ఫలితంగా భీమ్లానాయక్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
చాలాకాలం అయింది తెలుగు సినిమాలలో రెండు పాత్రలు పోటాపోటీగా చూసి. ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాలో పవన్ – రానా పాత్రలను అలా చూపించడం పెద్ద ఎస్సెట్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సాంగ్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్ళాయి. పవన్ అభిమానుల నుంచి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ భీమ్లానాయక్ మూవీలో చూపించారు. వీరి పాత్రల్లో ఏది కాస్త తగ్గినా సినిమాకు బలం పోయేది. కానీ, ఈ విషయంలో స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకత్వం వహించిన సాగర్ కె చంద్ర చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా భీమ్లానాయక్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.