సినిమా ధియేటర్లు ఓపెన్ అయితే ఫస్ట్ రిలీజ్ అయ్యే హీరో సినిమా ఇదే..!!

మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి వ్యాపార రంగాలతో పాటు సినిమా రంగం కూడా భారీ స్థాయిలో దెబ్బతింది. సరిగ్గా వేసవి సమయంలో ఈ వైరస్ రావడంతో దేశవ్యాప్తంగా థియేటర్లు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ వల్ల క్లోజ్ అవ్వటంతో సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కావాల్సిన సినిమాల నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వాటికి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వాలు ఇంకా సినిమా థియేటర్లకు మినహాయింపు ఇవ్వకపోవడంతో ప్రభుత్వాలపై థియేటర్ల యాజమాన్యాలు సంఘాలు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా అక్టోబర్ మూడో వారంలో ధియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి ఉందన్న వార్తలు నేషనల్ మీడియాలో వస్తున్నాయి.

Ram Pothineni Gets Hurt On The Sets Of 'Red'కాగా వచ్చిన వార్తలు మేరకు సినిమా హాల్స్ అక్టోబర్ మూడో వారంలో ఓపెన్ అయితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో ఎలా ఉన్నా ఫస్ట్ మాత్రం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన “రెడ్” సినిమా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం 15 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా… షూటింగ్ ఆల్రెడీ ప్రస్తుతం పద్మా నగర్ లో జరుగుతుంది. దీంతో అంతా అనుకున్నట్టు థియేటర్లు అక్టోబర్ మూడో వారంలో ఓపెన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో “రెడ్” సినిమా రిలీజ్ చేయాలని రామ్ ఫిక్స్ అయిపోయాడట.

 

గతంలో ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుంది అన్న వార్తలు వచ్చినా తరుణంలో ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ చేస్తానని రామ్ మాట ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు అనుకున్నట్టుగా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండటంతో…. రామ్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రెడీ అయ్యారు. మరోపక్క రానా “విరాట పర్వం” అదే విధంగా నాగచైతన్య నటిస్తున్న “లవ్ స్టోరీ” ఇంకా కొంత మంది హీరోల సినిమాలు కూడా థియేటర్ లలో ఓపెన్ అయితే రిలీజ్ చేద్దాం అని ఆలోచనలో ఉన్నారట. మరి కేంద్ర ప్రభుత్వం ఈసారి థియేటర్లకు మినహాయింపు ఇస్తుందో లేదో చూడాలి.