సినిమా

Acharya: చిరంజీవి కెరీర్‌లో ఇదే తొలిసారి.. వ‌ర్రీ అవుతున్న మెగా ఫ్యాన్స్!

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `ఆచార్య‌`. భరత్ అనే నేను వంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `సిద్ధ‌` అనే కీల‌క పాత్ర‌ను పోషించారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న అట్ట‌హాసంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇక‌పోతే ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టించార‌న్న సంగ‌తి తెలిసిందే. చిరుకు జోడీగా కాజ‌ల్ ను ఎంపిక చేయ‌గా.. రామ్ చ‌ర‌ణ్ కోసం పూజాను తీసుకున్నారు. కానీ, ఎప్పుడైతే ఈ సినిమా ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిందో అప్ప‌టి నుంచీ కాజ‌ల్ పాత్ర‌పై ర‌క‌ర‌కాల అనుమానాలు తెర‌పైకి వ‌చ్చాయి.

Acharya CM Jagan: Jagan Master Mind behind This..!?

ట్రైల‌ర్ లో కాజ‌ల్ ను క‌నీసం ఒక్క షాట్ లో కూడా చూపించ‌క‌పోవ‌డంతో.. ఆచార్య‌లో ఆమె పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఉండ‌ద‌నే ప్ర‌చారం మొద‌లైంది. అలాగే కాజ‌ల్ పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను చాలా వ‌ర‌కు తొల‌గించార‌ని కూడా వార్తలు వ‌చ్చాయి. వీటికి తోడు హైద‌రాబాద్ లో జ‌రిగిన‌ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏ ఒక్క‌రూ కాజ‌ల్ గురించి ప్ర‌స్తావించ‌లేదు. అస‌లు ఆమె పేరునే ఎవ‌రూ ఎత్త‌లేదు.

దీంతో అస‌లు ఆచార్య‌లో కాజ‌ల్ ఉందా..? లేదా..? అంటూ అభిమానులు, నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో.. ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కొర‌టాల శివ ఫైన‌ల్‌గా కాజ‌ల్ లేద‌ని తేల్చేశారు. అయితే చిరంజీవి త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో హీరోయిన్‌ లేకుండా సినిమా చేయడం ఇదే తొలిసారి. ఇంత‌కు ముందెప్పుడూ జోడీ లేకుండా చిరు సినిమా చేసింది లేదు.

పైగా ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్ ఉండటం చాలా ముఖ్యం. హీరో సరసన హీరోయిన్ ఉంటేనే ఏ సినిమా అయినా సంపూర్ణంగా కనిపిస్తుంది. కానీ, చిరు మాత్రం కొర‌టాలపై ఉన్న న‌మ్మ‌కంతో కాజ‌ల్‌ను త‌ప్పించి ఆచార్యను చేసేశారు. దీంతో రిజ‌ల్డ్ ఎక్క‌డ తేడా కొడుతుందో అని మెగా ఫ్యాన్స్ ఇప్పుడు వ‌ర్రీ అయిపోతున్నారు.

 


Share

Related posts

వర్మ తర్వాత సినిమా ఏంటో చూడండి…! ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేశాడు..!

sekhar

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ

Siva Prasad

సూర్య మాదిరిగా డేర్ చేస్తే టాలీవుడ్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ వస్తాయో ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar