అక్కినేని నాగచైతన్య అవ్వకముందు సమంత సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్లలో ఉండేది. చాలా మంది డైరెక్టర్లకు సినిమా హీరోలకు సమంత లక్కీ హీరోయిన్ కూడా. అటువంటి సమంత నాగచైతన్యని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో చాలావరకు సినిమాలు తగ్గించేసింది. మంచి క్యారెక్టర్ కలిగిన సినిమాలు చేస్తూ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ రాణిస్తోంది. కాగా ఫిట్నెస్ విషయంలో మాత్రం సమంత చాలా పర్ఫెక్ట్ డైట్ షెడ్యూల్ తో పాటు వర్క్ ఔట్స్ చేస్తది అని అందరికీ తెలుసు.
లాక్ డౌన్ సమయంలో జిమ్ లో అనేక ఫోజులిచ్చి, పంటలు పండించి నెటిజన్లను ఆకట్టుకున్న సమంత తాజాగా జిమ్ లో దిగిన పూర్తి ఫిట్నెస్ కలిగిన ఓ ఫోటో ఒకటి పెట్టి అభిమానులను నెటిజన్లకి ఒక్కసారిగా మతి పోయేటట్లు చేసింది. ఫోటో చూసి చాలామంది నెటిజన్లు పెళ్లి అయినా గానీ సమంతా లో అందం ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది “జాను” సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత మరో తెలుగు సినిమా ప్రాజెక్టు ఓకే చేయలేదు. పరిస్థితి ఇలా ఉండగా త్వరలోనే తెలుగు, తమిళం, కన్నడం భాషలలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా సమంత దిగిన ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో….. ఫోటో చూసి కామెంట్ పెట్టడానికి కుర్రోళ్ళు తెగ ఎగబడుతున్నారు.