Rakesh Master: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కొద్దిసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరుగాంచిన కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లు రాకేష్ మాస్టర్ యొక్క శిష్యులే. దాదాపు 15 చిత్రాలకు కొరియోగ్రఫీ అందించడం జరిగింది. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు అందరికీ కొరియోగ్రఫీ అందించారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మ పోలీసు వాళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గటంతో… రాకేష్ మాస్టర్ చాలా వరకు సోషల్ మీడియాకి పరిమితం అయిపోయారు.
ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్దపెద్ద హీరోలపై కాంట్రవర్సీ కామెంట్లు చేయటం.. ఆ రకంగా వైరల్ అయ్యారు. ఆ తరువాత రకరకాల వీడియోలు చేస్తూ… వెబ్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారితో కూడా రకరకాల వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం హనుమాన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో రాకేష్ మాస్టర్ అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో వైద్యులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకి.. సన్నిహితులకు తెలియజేయడం జరిగింది.
అయితే ఆదివారం విశాఖపట్నంలో ఓ ఈవెంట్ లో పాల్గొని తిరిగి హైదరాబాదు వచ్చిన రాకేష్ మాస్టర్ కి… తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాకేష్ మాస్టర్ మృతి పై డాక్టర్లు స్పందించారు. ఇవాళ ఉదయం రక్తపు విరోచనాలు కావటంతో ఆయన పరిస్థితి పూర్తిగా విషమించింది. “ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ గాంధీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. డయాబెటిక్ పేషెంట్ కావడం, సివియార్ మెటాబాలిక్ ఎసిడోసిస్ కావటంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి మరణించారు అని గాంధీ ఆసుపత్రి సూపరింటేండెంట్ రాజారావు తెలియజేశారు.