NewsOrbit
న్యూస్ సినిమా

తమన్నా బాలీవుడ్ సినిమా వార్తలో అసలు నిజం ఇదే …!

Share

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గత చిత్రం గద్దలకొండ గణేష్. ఈ సినిమాకి వరుణ్ తేజ్ మేకోవర్ పెద్ద ప్లస్ అని చెప్పాలి. దర్శకుడు హరీష్ శంకర్ వరుణ్ తేజ్ ని ఈ సినిమాలో ముందెన్నడు లేని విధంగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించింది.

అయితే వాస్తవంగా ఈ సినిమాని 2014 లో వచ్చిన తమిళ సూపర్ హిట్ సినిమా జిగర్తాండ కి రీమేక్ గా తెరకెక్కించారు. పిజ్జా సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా తమిళ పరిశ్రమలో ఫేమస్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన జిగర్తాండ కోలీవుడ్ లో సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో అదే సంవత్సరం ఈ సినిమాని బాలీవుడ్ లో నిర్మించాలని అనుకున్నారు మేకర్స్. కాని అది ఇన్నాళ్ళకి కార్యరూపం దాల్చుతోంది.

హిందీ రీమేక్ లో విలన్ గా అజయ్ దేవగణ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్టు తాజా సమాచారం. వాస్తవంగా తమన్నా బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికి అక్కడ సక్సస్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది. తెలుగు తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్నపటికి ఈ బ్యూటికి బాలీవుడ్ లో మాత్రం భారీ సినిమాలో ఛాన్స్ రావడం లేదు. దాంతో తమన్నా కి హిందీలో ఒక భారీ హిట్ అందుకోవాలని తెగ తాపత్రయపడుతుంది. మరి ఈ సినిమాలో నటించేది గనక నిజమైతే సక్సస్ అందుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


Share

Related posts

నంద్యాల కేసులో దొరికిందెవరు..!? టీడీపీ నేత ఎందుకు రాజీనామా చేశారు..!?

Yandamuri

Samantha Akkineni Amazing Looks

Gallery Desk

Mamata Banerjee: నందిగ్రామ్ లో ఓటమిపై మమత కీలక వ్యాఖ్యలు!అన్ని లెక్కలు తేలుస్తామని ప్రకటన!

Yandamuri