NewsOrbit
Entertainment News సినిమా

Salaar: ప్రభాస్ సలార్ లాంటి డైనోసార్ ని ఆపగల సత్తా ఉంది ఈ ఒక్క సినిమా కే !

Advertisements
Share

Salaar: భారతీయ చలనచిత్ర రికార్డులను బ్రేక్ చేసిన బాహుబలితో ఊహించని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో “సలార్” సినిమా చేయటం సంచలనంగా మారింది. హీరోని ఎనర్జిటిక్ గా అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలతో పాటు VFX ఎఫెక్ట్స్ తో… హై వోల్టేజ్ ఫైట్లతో అద్భుతంగా సన్నివేశాలు చిత్రీకరించడంలో ప్రశాంత్ నీల్ స్టైలే వేరు. KGF, KGF 2 సినిమాలలో హీరో యాష్ నీ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న “సలార్” ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. “కేజిఎఫ్ 2″తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన డైరెక్టర్ తో “బాహుబలి” హీరో ప్రభాస్ చేస్తూ ఉండటం.. సంచలనంగా మారింది. ఈ క్రమంలో “బాహుబలి” మాదిరిగానే “సలార్” సినిమాని కూడా రెండు భాగాలుగా విడుదల చేస్తూ ఉన్నారు.

Advertisements

This one movie has the ability to stop a dinosaur like Prabhas Salaar

మొదటి భాగం సెప్టెంబర్ 28వ తారీకు విడుదల చేయాలని భావించగా.. సీజే వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో సలార్ సెప్టెంబర్ నెల ఆఖరికి వస్తున్నట్లు చాలా సినిమాలు భావించి వెనకడుగు వేయగా ఇప్పుడు వాయిదా వార్త రావటంతో ముందుగానే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డైనోసార్ లాంటి సినిమా కావటంతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకి పోటీగా రావడానికి ఎవరు ధైర్యం చేయడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సరికొత్తగా ప్రభాస్ డైనోసార్ “సలార్” సినిమాకి పోటీగా సల్మాన్ ఖాన్ “టైగర్ 3”.. రాబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisements

This one movie has the ability to stop a dinosaur like Prabhas Salaar

“సలార్” నవంబర్ నెలలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. అదే నెలలో సల్మాన్ ఖాన్ “టైగర్ 3” రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ చేయటం జరిగిందట. దీంతో ప్రభాస్ “సలార్” లాంటి డైనోసార్ సినిమాకి సరైన కరెక్ట్ పోటి హీరో సల్మాన్ వస్తున్నాడని కచ్చితంగా “సలార్” కలెక్షన్స్ కి “టైగర్ 3” తో గండి కొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సిన “సలార్” వాయిదా వేయడానికి గల కారణం షారుఖ్ “జవాన్” సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ భయపడినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నవంబర్లో వస్తున్న ప్రభాస్ “సలార్” సినిమాకి.. సల్మాన్ ఖాన్ “టైగర్ 3″తో పోటీ ఇవ్వనున్నట్లు టాక్. ఈ వార్త నార్త్ లో ట్రేండింగ్ గా మారింది. దీంతో చాల మంది ప్రభాస్ “సలార్” లాంటి డైనోసార్ ని ఆపగల సత్తా సల్మాన్ “టైగర్ 3” కే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ కేరియర్ లో బాలీవుడ్ ఇండస్ట్రీలో టైగర్ రెండు భాగాలూ అనేక రికార్డ్స్ క్రియేట్ చేశాయి.


Share
Advertisements

Related posts

Akshara Review : అక్షర మూవీ రివ్యూ

siddhu

ఆది పురూష్ : ప్రభాస్ ఫాన్స్ నాగశ్విన్ పైన కోపంగా ఉన్నారా ?

GRK

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య ప్రేమ కథ తెలుసుకోవాలని ఉందా?

Varun G