Kushi: శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన “ఖుషి” సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా అంతా బాగానే ఉన్నా గాని కొన్ని సన్నివేశాలు సినిమాకి బాగా మైనస్ అయిందని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమా ఫస్ట్ ఆఫ్ కామెడీతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందో.. సమంత ఫ్లాష్ బ్యాక్ సీన్స్.. అంత దెబ్బ వేశాయని జనాలు చెబుతున్నారు. ఇదే సమయంలో సమంత ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వల్లే సినిమా ఫ్లాప్ అయిందని చెబుతున్నారు. ఆ సన్నివేశాలలో సమంత చాలా చండాలంగా చూపించడంతోపాటు.. సీన్స్ కూడా ఆ రకంగానే తీశారని కామెంట్లు వస్తున్నాయి.
ఫ్రెష్ లవ్ స్టోరీ కొత్త జోనర్ ఎంచుకున్న శివ నిర్వాణ సమంత ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో కొంత జాగ్రత్త పడి ఉంటే.. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ లో కొడుకు కోసం తల్లిదండ్రులు ఏదైనా చేస్తారు అన్న తరహాలో సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా అంతా బాగానే ఉన్నా గాని సమంత ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో పాటు.. సెకండాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉంచడం వల్ల.. ప్రేక్షకుల నుండి నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. కానీ చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ అని చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ లో చూపించడంతో అభిమానులు.. సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు రెండు మూడు సంవత్సరాలు నుండి విజయ్ దేవరకొండ కి చెప్పుకోదగ్గ హిట్ లేదు.
గత ఏడాది విడుదలైన “లైగర్” విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. పైగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “లైగర్”.. అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇటువంటి పరిణామాల మధ్య విజయ్ దేవరకొండ తనకు కలిసి వచ్చిన ప్రేమ కథ జోనర్ ఎంచుకొని ఖుషి సినిమా చేశారు. వాస్తవానికి సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలోనే విడుదల కావాలి. కానీ మధ్యలో సమంత అనారోగ్యానికి గురి కావడంతో.. సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల చేయడం జరిగింది.