సినిమా రంగం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టమైన అభిమాన హీరో హీరోయిన్లను తెరపై చూస్తూ ఎంతో ఆనంద పడుతుంటారు. ఎలాగైనా తమ అభిమాన సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. అదేవిధంగా తమకిష్టమైన సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. తమ అభిమాన నటుల ఇల్లు ఎలా ఉంటుంది? వారి కుటుంబ విషయాలు, వారి బంధువుల గురించి తెలుసుకోవాలని ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. మరి అలాంటి కొంతమంది సెలబ్రిటీలు వారి బంధుత్వాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…
కమల్ హాసన్ – సుహాసిని: తమిళంలో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న కమల్ హాసన్ స్వయానా తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరైన సుహాసినికి బాబాయ్ అవుతారు. కమల్ హాసన్, చారుహాసన్ అన్నదమ్ములు కాగా అందులో చారు హాసన్ కుమార్తె సుహాసిని.
సావిత్రి-రేఖ: బాలీవుడ్ చిత్రాలలో ఒక ఊపు ఊపిన రేఖ జెమినీ గణేషన్ మొదటి భార్య అయిన పుష్పవల్లి కూతురు. తరువాత కొంత కాలానికి జెమినీ గణేష్ సావిత్రిని పెళ్లి చేసుకోవడం వల్ల హీరోయిన్ రేఖకు సావిత్రి పిన్ని అవుతారు.
ఏ ఆర్ రెహమాన్-జీవీ ప్రకాష్: సంగీత దర్శకుడిగా పరిచయమై, హీరోగా మారిన జీవీ ప్రకాష్ స్వయంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు అవుతారు. రెహమాన్ పెద్ద అక్క కుమారుడే జీవి ప్రకాష్.
విజయ్ కుమార్-అరుణ్ విజయ్: సాహో సినిమా ద్వారా ఓ పవర్ ఫుల్ హీరోగా పరిచయమైన అరుణ్ స్వయానా సీనియర్ నటుడైన విజయ్ కుమార్ మొదటి భార్య కొడుకు.
జయసుధ-విజయ నిర్మల: సహజనటి జయసుధ కృష్ణ భార్య విజయనిర్మల స్వయాన అత్త అవుతారు. జయసుధ విజయనిర్మల నటించిన పండంటి కాపురం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
చంద్రమోహన్-కె విశ్వనాథ్: కళాతపస్వి కె.విశ్వనాథ్, చంద్రమోహన్ స్వయాన కజిన్ బ్రదర్స్ అవుతారు.
ప్రియమణి-విద్యాబాలన్: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో విద్యాబాలన్, ప్రియమణి ఇద్దరూ కజిన్ సిస్టర్.
నగ్మా-జ్యోతిక-రోషిని: 1990లో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పిన ఈ ముగ్గురు సొంత అక్క చెల్లెలు.
ఐశ్వర్య రాజేష్-శ్రీలక్ష్మి: కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాల ద్వారా పరిచయమైన ఐశ్వర్య రాజేష్ సీనియర్ నటి శ్రీలక్ష్మి కి మేనకోడలు అవుతారు.