Sai pallavi: ఈసారి క్రెడిట్ మొత్తం నానికే..ఫిదా చేయలేకపోయిన సాయి పల్లవి..?

Share

Sai pallavi: సాయి పల్లవి అంటే ఎలాంటి సినిమా అయినా తన పాత్రతో సౌత్ ఆడియన్స్‌ను ఫిదా చేసేస్తుందని ఇప్పటి వరకు అందరూ చెప్పుకున్నారు. టాలీవుడ్‌కు ఫిదా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తర్వాత ఎం సి ఏ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరి చిత్రాలతో విపరీతంగా క్రేజ్ సంపాదించుకొని టాలీవుడ్‌లో సెటిలయింది. ఇటీవల వచ్చిన లవ్ స్టోరి సినిమాతో మరో సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలోనూ సాయి పల్లవికే ఎక్కువ పేరొచ్చింది.

this time credit completely goes to nani

నేచురల్ పర్ఫార్మెన్స్‌తో డాన్సులతో సాయి పల్లవి ఫిదా చేసేస్తుందని మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా పొగడ్తల వర్షం కురిపించారు. కొన్ని ప్రత్యేకమైన పాత్రలుంటే అలాంటి సినిమాకు సాయి పల్లవి మాత్రమే కావాలని పట్టుపడుతున్నారు. కీర్తి సురేశ్, పూజా హెగ్డే రష్మిక మందన్నలతో పోల్చుకుంటే తెలుగులో సాయి పల్లవి చేసింది తక్కువ సినిమాలే అయినా కొన్ని విషయాలలో వారికంటే ఓ మెట్టు పైనే ఉంది.

Sai pallavi: సాయి పల్లవి ఉన్న సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంటుంది.

అందుకే సాయి పల్లవి ఉన్న సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంటుంది. తాజాగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్‌కు ముందు వరకు సాయి పల్లవి పోస్టర్స్ చూసి అందరూ అదే అనుకున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి దే పై చేయి అవుతుందని చెప్పుకున్నారు. కానీ, తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే మాత్రం నానికే ఎక్కువ పేరు దక్కింది. ఈసారి సాయి పల్లవి రోల్ అంతగా ఎస్టాబ్లిష్ కాలేదని టాక్ వినిపిస్తోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన కృతి శెట్టి,
అలాగే గతంలో ప్రేమమ్ సినిమాతో పరిచయమైన మడోనాలతో కలిపి మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రత్యేకించి మాత్రం సాయి పల్లవి గురించి మాట్లాడుకోవడం లేదు. చూడాలి లాంగ్ రన్‌లో ఏమైనా సాయి పల్లవి పేరు వినిపిస్తుందేమో.


Share

Recent Posts

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

42 mins ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

3 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

4 hours ago

బాలకృష్ణకు చెల్లి అనగానే బోరున ఏడ్చేసిన హీరోయిన్ లయ.. ఎందుకంటే!

ఒకప్పటి హీరోయిన్ లయ స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ 2000 కాలంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్ పీక్…

5 hours ago