Jabardasth: తెలుగు టెలివిజన్ రంగంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన షో జబర్దస్త్. ఈ కామెడీ షో ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించారు. ఒకప్పుడు టిఆర్పి రేటింగ్ లలో జబర్దస్త్ షోనీ కొట్టింది లేదు. అంతలా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ఈ షోలో యాంకర్స్ గా చేసిన అనసూయ, రేష్మి, విష్ణు ప్రియ అనేకమంది మంచి క్రేజ్ సంపాదించారు. ఈ క్రమంలో మొన్నటిదాకా సౌమ్యారావు యాంకర్ గా రాణించింది. అయితే ఇప్పుడు సౌమ్యరావు స్థానంలో కొత్త యాంకర్ గా సిరి హన్మంత్ ను తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో సిరికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది.
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సిరి.. టాప్ ఫైవ్ లో నిలిచింది. అంతకుముందు యూట్యూబర్ గా గుర్తింపు సంపాదించి తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అనంతరం టెలివిజన్ రంగంలో అనేక షోలలో రాణించిన సిరి.. మొన్ననే షారుక్ కొత్త సినిమా “జవాన్”లో కూడా కీలక పాత్ర పోషించింది. జవాన్ సినిమాతో సిరికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. సీజన్ ఫైవ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో ఎక్కువగా విజయవంతమైన కెరియర్ తో సిరి దూసుకుపోతూ ఉంది. తాజాగా జబర్దస్త్ షోలో యాంకర్ అవకాశం రావడంతో సిరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్నాళ్ల నుండి జబర్దస్త్ షోలో చాలామంది యాంకర్లు మరియు జడ్జీలు మారుతూ ఉన్నారు. ప్రారంభంలో రోజా, నాగబాబు ఉన్న టైంలో భారీ ఎత్తున రేటింగ్ వచ్చేది. ఆ తర్వాత వాళ్ల స్థానంలో మను కుష్బూ జగ్జీలుగా రాణించారు. వాళ్లు కూడా వెళ్లిపోయిన తర్వాత ప్రజెంట్ కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో సిరి పలు ఓటిటి షోలకు హోస్ట్ గా చేసింది. టెలివిజన్ రంగంలో యాంకర్ గా కూడా కొన్ని కార్యక్రమాలకు వ్యవహరించింది. అయితే తెలుగులో టాప్ మోస్ట్ షో జబర్దస్త్ కి సిరి ఇప్పుడు యాంకరింగ్ చేయటానికి రెడీ కావడం సంచలనంగా మారింది.