“బాహుబలి” సినిమా తో దేశవ్యాప్తంగా మాత్రమే కాక ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభాస్ రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అదే రీతిలో తనకంటూ గుర్తింపు కూడా దక్కించుకున్నాడు. అంతకు ముందు “బాహుబలి” రిలీజ్ అవ్వకు ముందు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే ప్రభాస్ క్రేజ్ పరిమితం. కానీ ప్రస్తుతం “బాహుబలి” పుణ్యమా ప్రభాస్ భవిష్యత్తు మొత్తం మారిపోయింది.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్లు కూడా ప్రభాస్ కోసం స్క్రిట్ లు రెఢీ చేసుకుని ఎప్పుడు ఓకే అంటే అప్పుడు వినిపించాలి అనే రీతిలో పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రభాస్ “రాధే శ్యామ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ ఇటలీకి వెళ్లారు. ఇదిలా ఉండగా మీడియాలో కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ లేటెస్ట్ గా సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసారు. ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య లో ప్రభాస్ రికార్డును క్రియేట్ చేయడం జరిగింది.
అదేమిటంటే ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 20 మిలియన్లకు చేరుకుంది. మూడు నెలల క్రితమే 15 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న అల్లు అర్జున్ ని క్రాస్ చేసిన ప్రభాస్ తాజాగా 20 మిలియన్ మార్కులు టచ్ చేయడంతో…. సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరో ఫేస్ బుక్ లో లేని ఫాలోవర్స్ ప్రభాస్ కి మాత్రమే దక్షిణాదిలోనే ఇది ఓ రికార్డుగా నమోదయింది. అభిమానులకు ప్రభాస్ ధన్యవాదాలు తెలియజేశారు.