29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

HBD Ram Charan: ఈసారి రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఫ్యాన్స్..!!

Share

HBD Ram Charan: ఈనెల 27వ తారీకు నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు ఈసారి చాలా గ్రాండ్ గా… చెర్రీ బర్తడే వేడుకలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. 38వ జన్మదిన వేడుకలు కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆస్కార్ గెలిచిన జోష్ లో అభిమానులు ఉండటంతో… ఈ జన్మదిన వేడుకలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మార్చి 25న ఒక ఇంపీరియల్ కామన్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో చరణ్ బర్తడే వేడుకలు ప్లాన్ చేస్తున్నారు. “RRR”తో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకోవడంతో ఈ రకంగా ఈసారి వేడుకలు ఘనంగా జరుపుతున్నారు.

This time Ram Charan's birthday celebrations are grandly planned by the fans

నిన్న మొన్నటి వరకు చరణ్ పేరు హాలీవుడ్ ఇండస్ట్రీలో రీ సౌండ్ వినిపించింది. అంతేకాదు హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సినిమా అవకాశాలు కూడా చెర్రీకి వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు. ఈ రకంగా చరణ్ బర్త్ డే వేడుకలు వెరైటీగా ఈసారి ప్లాన్ చేస్తూ ఉన్నారు. రెండు రోజులు ముందుగా ఫాన్స్ ఇంపీరియల్ కామన్ మోషన్ పోస్టర్ విడుదల… చేస్తూ ఉంటే బర్తడే నాడు ఇంకెన్ని సర్ప్రైజ్ ఇస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే అదే రోజు శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.

This time Ram Charan's birthday celebrations are grandly planned by the fans

ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు తెలియజేయడం జరిగింది. టైటిల్ లోగో చాలా స్పెషల్ గా శంకర్ ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సునీల్, ఎస్ జె సూర్య, అంజలి కీలకపాత్రలో కనిపిస్తున్నారు. చరణ్ నీ మూడు విభిన్నమైన పాత్రలలో శంకర్ చూపిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇలా కమిటయితేనే షోలో ఛాన్స్ ..?

GRK

మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యాను

Siva Prasad

జబర్దస్త్ సెట్ పై ఆమెకి నిజంగానే ముద్దు పెట్టిన కమెడియన్..! ఒక్కసారిగా అంతా షాక్

arun kanna