Acharya : కరోనా కారణం వల్ల గత సంవత్సరం మొత్తం ఎటువంటి సినిమాలు లేకుండా ఎంతో విరామం తీసుకున్న హీరోలందరూ ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరోలందరూ ఒప్పుకున్న సినిమాలను చేస్తూ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సినిమా విడుదల తేదీలను కూడా వరుసగా ప్రకటిస్తూ థియేటర్ల ముందు కూడా గట్టి పోటీ వస్తున్నారు.పలువురు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అవడానికి ముహూర్తం పిక్స్ చేశారు. ఈ క్రమంలోనే మే 13న ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు ప్రకటించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటి? ఆ స్టార్ హీరోలుఎవరు ? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం….
ఆచార్య:
తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఎంతో ప్రత్యేకతను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ తేజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా సిద్ధూ అనే పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాధే:
అదే రోజున మరొక స్టార్ హీరో కూడా బరిలో దిగనున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కండలవీరుడుగా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ నటిస్తున్న “రాధే” చిత్రాన్ని దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించారు.ఈద్ సందర్భంగా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ తెలుగులో విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. అదే ఫార్ములా తోనే మళ్లీ రాధే సినిమా కూడా తెలుగులో విడుదల చేయబోతున్నారు.
మరక్కార్:
తెలుగులో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ ఎంతో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ తప్ప మరొకరిని ఊహించుకోలేమనే విధంగా నటించారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మలయాళం స్టార్ మోహన్ లాల్ అత్యంత భారీ బడ్జెట్ తో “మరక్కార్ అరేబియా సముద్ర సింహం”. అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా తరహాలో ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నారు.
ఈ ముగ్గురు స్టార్ హీరోలు మే 13 న ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయో వేచి చూడాల్సిందే.