NTR 30: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. “RRR” వంటి అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పైగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తర్వాత చేస్తున్న సినిమా కావటంతో ఎన్టీఆర్ సినిమా అని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ రిజల్ట్ రాకూడదని తన కెరీర్ లో ఇది 30వ సినిమా కావటంతో ప్రతి విషయాన్ని ఎన్టీఆర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి కూడా “RRR” కి సంబంధించిన కష్టాలు వెంటాడుతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయంలోకి వెళ్తే అప్పట్లో “RRR”లో ఎన్టీఆర్ కి జోడిగా హీరోయిన్ విషయంలో దాదాపు సంవత్సరం పైగానే క్లారిటీ రాలేదు. బ్రిటిష్ అమ్మాయి పాత్ర కావటంతో చాలా టైం పట్టింది. చివరకి..ఒలివియా మోరిస్ నీ సెలెక్ట్ చేసుకుని అద్భుతంగా సినిమా తెరకెక్కించటం జరిగింది. ఇప్పుడు ఇదే తరహాలో కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాకి హీరోయిన్ కష్టాలు వెంటాడుతున్నట్లు సమాచారం. ఎవరిని తీసుకోవాలో అనేదానిపై కొరటాల తర్జన బార్జన పడుతున్నట్లు వినికిడి. “NTR 30 ” అనే వర్కింగ్ టైటిల్.. కలిగిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో జరగనుంది.
ఇప్పటికీ హీరోయిన్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో.. అభిమానులు కూడా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే(Pooja Heghde), ఆలియా భట్(Alia Bhatt), శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్(Jahnavi Kapoor).. కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన రాకపోవడంతో… ఎన్టీఆర్ మూవీకి హీరోయిన్ కష్టాలు తప్పడం లేదన్నమాట బయట వినిపిస్తోంది. ఇలా ఉంటే గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో “జనతా గ్యారేజ్”(Janatha Garage) అనే సినిమా రావడంతో వస్తున్న ఈ రెండు సినిమాపై భారీ అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు. “ఆచార్య”(Acharya) ప్లాప్ కావడంతో.. కొరటాల కూడా “NTR 30” సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందట.