RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. రామరాజు పాత్రలో చరణ్ నటన ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో ప్రపంచ స్థాయిలో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న చరణ్ తన తర్వాత సినిమా సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నారు. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నారు. ఒకటి స్టూడెంట్ మరొకటి కలెక్టర్ ఇంకొకటి ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాన్ ఇండియా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ ఇంకా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఎప్పటినుండి అభిమానులు టైటిల్ ప్రకటించాలని కోరుతున్నారు. పైగా శంకర్ సినిమా కావటంతో… టైటిల్ కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి పండుగకు ముందు “RC 15” టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ గ్రాండ్ ఫంక్షన్ గా చేసి రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు రెడీ అయినట్టు సమాచారం.

ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు న్యూజిలాండ్ లో జరిగింది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాజకీయ నేపథ్యంలో ఎలక్షన్ సవలను చిత్రీకరించారు. ప్రస్తుతం కర్నూల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది.అంతేకాదు ఒక కీలకమైన పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఉన్నట్లు సమాచారం. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్..గా నటిస్తోంది. ఎస్జె సూర్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.