NewsOrbit
Entertainment News సినిమా

Devara: అదరగొట్టిన ఎన్టీఆర్…కొరటాల శివ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్..!!

Share

Devara: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NTR 30 వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దిసేపటికి క్రితం విడుదల చేశారు. ఈ సినిమాకి “దేవర” అనే టైటిల్ ఖరారు చేయడం జరిగింది. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితం విడుదలైన టైటిల్ తో కూడిన పోస్టర్… అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు పూనకాలు తెచ్చుకుంటున్నారు. నల్ల చొక్కా నల్ల లుంగీ లో ఊర మాస్ లుక్ తో… ఫుల్ గడ్డంతో.. మంచి మాసివ్ గా ఎన్టీఆర్… ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

Image

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో పాత్ర అయితే మరొకటి వర్తమానంలో ఉండే రోల్ అని సమాచారం. ఎన్టీఆర్ కి తండ్రిగా పెద్ద ఎన్టీఆర్ గా కనిపించబోతున్నట్లు టాక్. సముద్రంపై ఆధిపత్య పోరు నేపథ్యంలో సినిమా ఉండబోతుందని.. రివేంజ్ తరహాలో.. స్క్రిప్ట్ ఉంటుందని నెగిటివ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన టైటిల్ తో కూడిన పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా హీరో శ్రీకాంత్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.

NTR30 first look is scheduled for May 19 - Telangana Today

ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ విశాఖపట్నంలో జరిగింది. అక్కడ ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నారు. “RRR”తో గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ కి మంచి పేరు రావడంతో… కొరటాల అదే రేంజ్ లో “దేవర” విజయం సాధించే దిశగా స్క్రిప్ట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. పైగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గతంలోనే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో “దేవర” సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్… భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

NTR 30: కొరటాల… ఎన్టీఆర్ సినిమా నుంచి లీకైన ఫోటో..!!

sekhar

RRR Trailar: RRR ట్రైలర్ రికార్డుల వేట.. రెండు రోజుల్లోనే క్రియేట్ చేసిన సరికొత్త రికార్డులు..!!

sekhar

Ashika Ranganath Orange Pics

Gallery Desk