Breaking: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసినదే. తమన్ ఈ చిత్రానికి సూపర్బ్ సంగీతం ఇస్తున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే “సర్కారు వారి పాట” మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు సినిమా మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “కళావతి”, “పెన్నీ” సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా సినిమాలో నుంచి మూడవ పాటను విడుదల చేశారు. “సర్కారు వారి పాట” టైటిల్ సాంగ్ ఇపుడు యూట్యూబ్ ని షేక్ చేయడానికి రెడీ అయ్యింది. అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. ఇంట్రడక్షన్ కు సంబంధించిన ఈ లిరికల్ వీడియోలో మహేష్ యాటిట్యూడ్, యాక్షన్ బ్లాక్స్ చూపించే విజువల్స్ బాగున్నాయి.