డిజిటల్ మీడియా వచ్చాక సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ కి ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఈ వెబ్ సిరీస్ ని చూడటానికి ప్రేక్షకులే కాదు వెబ్ సిరీస్ లో నటించడానికి టాప్ సెలబ్రిటీస్ సైతం ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతకముందు వెబ్ సిరీస్ అంటే జనాలకి అంతగా అవగాహన వచ్చేది కాదు. కాని ఎప్పుడైతే బాలీవుడ్ సీనియర్ సెలబ్రిటీస్ తో పాటు యంగ్ బ్యూటి కియారా అద్వాని..హాట్ బ్యూటీ రాధికా ఆప్టే నటించిన లస్ట్ స్టోరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిందో అప్పటి నుంచి వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ పెరిగింది.
ఆ తర్వాత అదే తరహాలో ఫ్యామిలీ మాన్ అన్న వెబ్ సిరీస్ వచ్చి బాగా ఆదరణ పొందింది. దాంతో ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ని రూపొందించారు. ఈ సీజన్ 2 లో అక్కినేని సమంత నెగిటివ్ రోల్ లో కనిపించనుంది. సీజన్ 1 లో నటించిన మనోజ్ బాజ్ పాయ్ ప్రియమణి సీజన్ 2 లోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇక బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్ తెరకెక్కింది. రీసెంట్ గా స్ట్రీమింగ్ కూడా అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ మీద నెగిటివ్ కామెంట్స్ తో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ గా యూత్ ని టార్గెట్ చేస్తూ బూతు కంటెంట్ తో రూపొందించారు.
రాస్ భరి అన్న టైటిల్ తో స్వరా భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి విమర్శలతో పాటు ఇప్పటివరకు వచ్చిన వెబ్ సిరీస్ లో చాలా తక్కువ రేటింగ్ వచ్చి నెగిటివ్ కామెంట్స్ వచ్చింది రాస్ భరి కే. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ స్వరా భాస్కర్ పోషించిన పాత్ర ఎంతో వివాదాస్పదం గా మారింది. అయితే సామాజిక ధృక్పథంతో ఆలోచిస్తే ఇలాంటి వెబ్ సిరీస్ తో ఎవరికి లాభం..ఎవరిని ఉద్దరించడానికి అని విశ్లేషకులు మాట్లాడుతున్నారట.