Intinti Gruhalakshmi: వారెవ్వా వసంత కండిషన్లు మామూలుగా లేవుగా.. ఈరోజు ఎపిసోడ్ లో ఫుల్ హైఫై ఫన్నీ డ్రామా..!!

Share

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి చూస్తుండగానే 523 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.. నేడు 524 ఎపిసోడ్ లో హై ఫై వసంత అంటే కొత్త పాత్రను పరిచయం చేయనున్నారు.. మొత్తానికి ఈ క్యారెక్టర్ ఇంట్లో నవ్వులు పండిస్తూ.. అటు లాస్యకు ఆశ్చర్యాన్ని కలిగించనుంది.. ఇంతకీ ఈ రోజు ఎపిసోడ్ లో వసంత పెట్టిన కండిషన్స్ ఏంటి ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసుకుందాం..!!

Today Intinti Gruhalakshmi: Serial Episode Hilarious
Today Intinti Gruhalakshmi: Serial Episode Hilarious

వారెవ్వా వసంత ఇక్కడ తగ్గేదేలే..!!

 

తులసి వాళ్ళ అత్తయ్య తో కొత్త పనిమనిషి వస్తే రానివ్వండి.. మీ అబ్బాయికి లాభం అనడంతో తను కూడా ఒప్పుకుంటుంది.. అనసూయమ్మ కొత్త పని మనిషి వచ్చాక నేను సోఫా లో కూర్చుని దర్బాని వేసుకుని దాన్ని ఫాలో అవుతూనే ఉంటాను వదిలేదే లేదు తులసి అంటుంది.. మరోవైపు అభి తన కాలేజీ ఫ్రెండ్ ని కలిసి తను ప్రస్తుత ఉన్న పొజిషన్ చేసి చెబుతాడు మన బ్రతుకు ఇంతేనా మనం మారమా.. అంటూ అంకిత కి చెబుతాడు దేనికైనా టైం రావాలి అని అనగా.. టైం రావడం కాదు కాలం కంటే మనమే ముందుగా పరిగెత్తాలి అని అభి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తరువాత తులసి నందు దగ్గరికి వచ్చి నేను లాస్య తులసి కాదు.. తులసి లా లాస్య ఎప్పటికీ మారదు అనే విషయాన్ని నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. నాకు లాగా తనని మార్చాలని ప్రయత్నం చేయకండి అని చెబుతుంది. కట్ చేస్తే..

 

ఉదయం ఇంట్లో అందరూ కలిసి హాల్లో జోకులు వేసుకుంటూ టిఫిన్ తింటూ ఉంటారు.. తులసి ని వేడివేడిగా వడలు వేసి తీసుకువస్తుంది.. అందరూ తలా ఒకటి వేయమని అడుగుతూ ఉంటారు.. ఇదంతా ఒక పక్క నుంచి గమనిస్తున్న నందుకి తినాలని ఉంటుంది కానీ తినలేని పరిస్థితి.. అలా వారందరూ తినడం చూస్తున్నా నందుకి నోరురూతూ ఉంటుంది.. అంతలో లాస్య టిఫిన్ అంటూ వెజిటేబుల్స్ సలాడ్ తీసుకొచ్చి తన ముందు పెడుతుంది.. నందు ఏంటి ఈ గడ్డి..!? గడ్డి కాదు నందు హెల్దీ బ్రేక్ ఫాస్ట్ అంటూ నందు చేయి తీసుకోని చేతిలో బ్రేక్ఫాస్ట్ పెడుతుంది.. మరోపక్క వడ వడ అంటూ ఇంట్లో వాళ్ళందరూ గోల చేయడం చూస్తే నందు కి కాలుతూ ఉంటుంది.. నందు దాన్ని కస్సుబుస్సు అనుకుంటు.. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తింటూ ఉంటాడు నందు.. లాస్య అమాయకంగా ఎలా ఉంది నందు అని అడుగుతుంది దీనిని కనిపెట్టిన వాడు ఎవడో గానీ పొడిచేయాలి అంటాడు.. అది విన్న వాళ్ళ అమ్మ కనిపెట్టిన వాడిని కాదు అది తయారు చేసేయ్ నీ చేతిలో పెట్టిన వాళ్ళని పొడిచేయ్ అంటుంది.‌. ఇప్పుడు ఎంట్రీ ఇస్తుంది నేను చేసి పెడతాను అంటూ వసంత..

Today Intinti Gruhalakshmi: Serial Episode Hilarious
Today Intinti Gruhalakshmi: Serial Episode Hilarious

తన వాలకం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు.. పనిమనిషి అప్డేటెడ్ గా ఉండడంతో వ్రాసి ఆనందంతో నీ పేరు ఏంటి అని అడుగుతుంది వారెవ్వా వసంత అంటుంది.. అది విన్న అనసూయమ్మ వారెవ్వా ఏంటి అది నీ ఇంటి పేరా అంటుంది..!? మార్కెట్లో నాకున్న పేరు.. నా వంట రుచి చూసిన వాళ్ళు ఎవరైనా వారెవ్వా అనాల్సిందే..!! నా కొడుక్కి మీ వంట నచ్చకపోతే వారేవా కాదు పోవే పో అంటాడు..!! ఇక పొద్దున్నే వస్తా అన్నావ్ కదా ఏంటి ఇంత లేట్ అయింది అంటే పొద్దున్నే వద్దనుకుని పెట్టాడు అందులో ఏసీ పనిచేయకపోవడంతో మళ్లీ ఏసి క్యాబ్ బుక్ చేసుకొని రావడానికి ఎంత టైం పట్టింది అని చెబుతోంది.. పూజ ఏం పాపం ఏసీ లేకపోతే తమ్ముడు ఉండలేరా నేను ఉండగలను కాకపోతే ఆ తర్వాత మీరు నా పక్కన ఉండలేరు అంటూ వసంత పంచ్ వేస్తుంది. మేడం నేను వంటింట్లో కుడికాలు పెట్టేముందు నేను చెప్పే కండిషన్స్ అందరూ వినాలి..!! అనసూయ వసంత మధ్య జరిగే సంభాషణలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.. తనకంటూ ఓ ప్రత్యేక రూమ్ కావాలి, ఒకవేళ వాషింగ్ మిషన్ పాడైపోతే బట్టలు ఉతకనని, పనంతా అయిపోయాక హాలులో టీవీ చూస్తాను.. అప్పుడు మాత్రం అడ్డు చెప్పకూడదని వసంత అనటంతోనే.. ఇంట్లో అందరూ అయ్యో వద్దమ్మా…! ఆ టీవి దగ్గరికి మేము రాము.. సుఖీభవ.. సుఖీభవ..!! అంటూ చెప్పే డైలాగ్స్ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కడుపుబ్బా నవ్విస్తాయి.. నందు తో ఇదిగో సారు ఇంట్లో వైఫై ఎప్పుడూ అన్ లో ఉండాలి. నాకు చెప్పకుండా వైఫై పాస్ వర్డ్ మార్చకూడదు.. అనడంతోనే వసంతను అనసూయమ్మ నిన్ను మేం పనిలో పెట్టుకున్నట్లు లేదు.. నువ్వే మమ్మల్ని పనిలో పెట్టుకున్నట్టు ఉంది అనడంతో ఇంట్లో అందరూ పగలబడి నవ్వుతారు.. లాస్య కూడా బిక్క మొహం వేసుకొని పని చేయడానికి వచ్చావు ఇన్ని కండిషన్లా..!? అందులో వసంత నేను సౌత్ ఇండియా పనిమనుషుల సంఘానికి సెక్రటరీని.. మాకు రూల్స్ ఉంటాయి అనడంతోనే ఇంట్లో వాళ్ళందరూ కలిసి అబ్బో అంటారు..!!

 

ఇలా వసంత లాస్య మధ్య సంభాషణలు జరుగుతుండగా నేటి ఎపిసోడ్ ముగిస్తుంది ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య నో చెప్పిన ఆఫీసు నందు ఇంటర్వ్యూకి బయలుదేరుతాడు.. ఇంతకీ ఆ ఇంటర్వ్యూ లో ఏం జరిగింది..!? నందు కి జాబ్ వస్తుందా.!! అనే విషయాలు తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..!!


Share

Related posts

Intinti Gruhalashmi: ఇంటింటి గృహలక్ష్మిలో వచ్చేవారం ఏం జరగనుందంటే..!? లాస్య అనుకున్నది సాధించడానికి ఈమెను రంగంలో దింపిందా.!!

bharani jella

Meesha Ghoshal New Wallpapers

Gallery Desk

ప్రధానిని వెంటాడుతున్న పాత ట్వీట్ !

Yandamuri