Nithiin: హీరో నితిన్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `జయం` సినిమాతో 2002లో టాలీవుడ్లో హీరోగా పరిచయం అయిన నితిన్.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం, సై సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నితిన్‌కు ఈ రోజు వెర్రీ వెర్రీ స్పెషల్.
ఈయన నటించిన `ఈష్క` సినిమా నేటికి విడుదలై పదేళ్లు పూర్తైంది.విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్గా చేసింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి కలిసి ఈ మూవీని నిర్మించారు. అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించారు. 2012, ఫిబ్రవరి 24న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది.
అప్పటి వరకు వరుస ఫ్లాపులతో తీవ్రంగా సతమతం అయిపోయాడు నితిన్. ఇక కెరీర్ క్లోజ్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో.. ఆయనకు ఇష్క్ మూవీ మంచి బూస్ట్ ఇచ్చి మళ్లీ ఫామ్‌లోకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇష్క్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నితిన్.. ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ పెట్టాడు.
`ఫిబ్రవరి 24 నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన తేదీ. పదేళ్ల క్రితం ఇదే తేదీన `ఇష్క్` సినిమా విడుదలైంది. దాదాపు నటుడిగా నాకు పునర్జన్మ ఇచ్చిన చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.ఇష్క్ పెద్ద హిట్ అవ్వడానికి నాలుగు కారణాలు ఉన్నాయి. విక్రమ్ కుమార్ కథ – దర్శకత్వం, పిసి శ్రీరామ్ యొక్క మ్యాజికల్ ఫ్రేమ్ లు – అద్భుతమైన విజువల్స్, అనూప్- అరవింద్ శంకర్లు అందించిన సంగీతం, నిత్యామీనన్ తో నా కెమిస్ట్రీ.. ఈ నాలుగు కారణాల వల్లే సినిమా మంచి విజయం సాధించింది.` అంటూ నితిన్ చెప్పుకొచ్చారు.