HBD Rajamouli: ప్రపంచ సినిమా రంగంలో ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది బాలీవుడ్ ఇండస్ట్రీ. కానీ ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడకోవాల్సి వస్తే రాజమౌళి గురించి ప్రపంచ సినిమా రంగం మాట్లాడుకుంటుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీనీ చాలా తక్కువగా చూసే బాలీవుడ్ సైతం జక్కన్న దెబ్బకి నోరు మెదపలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉంది. జక్కన్న ఎప్పుడైతే “బాహుబలి 2” తీయడం జరిగిందో అనేక రికార్డులు సృష్టించిందో… ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఛాయాచిత్రం పూర్తిగా మారిపోయింది. “బాహుబలి” తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి అనేక సినిమాలు చేసిన గాని.. అంతగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయాయి.
“బాహుబలి” తర్వాత “RRR” తో మరోసారి సత్తా చాటిన జక్కన్న.. ప్రపంచ సినిమా రంగాన్ని ఎంతగానో ఆకర్షించాడు. “RRR” విజయంతో హాలీవుడ్ ఇండస్ట్రీ చాలామంది ప్రముఖులు రాజమౌళి పనితీరుపై పొగడ్తల వర్షం కురిపించారు. “RRR” ఆస్కార్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారతదేశ దిగ్గజ దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి మూటగట్టుకున్న ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు నేడు కావడంతో చాలామంది ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1973లో కర్ణాటకలో జన్మించిన జక్కన్న “శాంతినివాసం” సీరియల్ ద్వారా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. 2001లో జూనియర్ ఎన్టీఆర్ తో “స్టూడెంట్ నెంబర్ వన్” అనే మొదటి సినిమా చేయడం జరిగింది.
ఆ తర్వాత సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, “RRR” ఇలా వరుస పెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. తన సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక రికార్డులు క్రియేట్ చేసిన జక్కన్న.. నెక్స్ట్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో జక్కన్న పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో విషెస్ తెలియజేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు జక్కన్న! నీకు అంత మంచే జరగాలని ఆశిస్తున్నా” అని ట్వీట్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో తారక్ మరియు జక్కన్న మధ్య మంచి బాండింగ్ మొదటి నుండి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ ట్విట్టర్ లో రాజమౌళికి విషెస్ తెలియజేస్తూ పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది.