వెబ్‌సిరీస్‌లో హ‌న్సిక‌


చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు సినిమాల‌కే ప‌రిమితం కావాల‌నుకోడం లేదు. సినిమాల‌తో పాటు పోటీ ప‌డుతున్న డిజిట‌ల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అలా అడుగుపెట్టిన వారిలో హ‌న్సిక కూడా ఉంది. తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూఓ గుర్తింపును సంపాదించుకున్న పాల‌బుగ్గ‌ల సొగ‌స‌రి హ‌న్సిక మొత్వాని ప్ర‌స్తుతం 50 సినిమాల‌ను పూర్తి చేసుకుంది. ఈమెకు పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు. ఈ గ్యాప్‌లో ఈ భామ‌.. వెండితెర నుండి డిజిట‌ల్ రంగంలోకి వెళ్ల‌డానికి నిర్ణ‌యించుకుంది. `పిల్ల‌జ‌మీందార్‌`, `భాగ‌మ‌తి` చిత్రాల ద‌ర్శ‌కుడు అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నుంది. ఇందులో హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుగుతుంది.