Avatar 2: ప్రపంచ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో అవతార్ 2 ఈనెల 16వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 2009వ సంవత్సరంలో వచ్చినా “అవతార్” విజువల్ వండర్ గా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ టైంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. వింత ప్రపంచ లోకంలో.. అద్భుత రీతిలో “అవతార్” సినిమాని జేమ్స్ కామెరూన్ చిత్రీకరించడం జరిగింది. కాగా మళ్లీ ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాల తర్వాత అవతార్ సీక్వెల్ వస్తూ ఉండటంతో సినీ ప్రేక్షకులందరూ సినిమా చూడటం కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. దీనిలో భాగంగా తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ బయటకు వచ్చింది. మేటర్ లోకి వెళ్తే టాలీవుడ్ రైటర్ మరియు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ “అవతార్ 2″కి పనిచేస్తున్నాడు. విషయంలోకి వెళ్తే ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ కి సంబంధించి రచయిత మరియు మాటలు రాయడం అవసరాల శ్రీనివాస్ రాయడం జరిగింది. తెలుగు సినిమా రంగంలో నటుడిగా మరియు రచయితగా ఇంకా దర్శకుడిగా తనకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. నటుడిగా ఎంత విజయం సాధించడం జరిగిందో ఆ రీతిగానే… రచయితిగా.. డైరెక్టర్ గా కూడా సక్సెస్ కావడం జరిగింది. అవసరాల శ్రీనివాస్ రాసే డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఈ క్రమంలో “అవతార్ 2″కి అవసరాల శ్రీనివాస్ అందించిన మాటలు ఎంత మేరకు ఉపయోగపడుతుందో… ఈ శుక్రవారం ధియేటర్ లలో తెలుస్తోంది. ఈ న్యూస్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు ₹3వేల కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన “అవతార్ 2” ఈ వీకెండ్ సుమారు 4.10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయట. త్వరలోనే ఐదు లక్షల మార్క్ కూడా చేరుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. దీంతో మొదటి వారంలోనే బుకింగ్స్ ద్వారా ₹45 కోట్ల నుంచి ₹80 కోట్ల వరకు కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని గ్రాస్ ₹16 కోట్లకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి పార్ట్ పండారా గ్రహంలో తెరకెక్కించగా రెండో భాగం సముద్ర గర్భంలో తీయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్.. సినిమాపై అంచనాలు పెంచేయడంతో.. మొదటివారం టికెట్లు హాట్ కేకుల అమ్ముడైపోయాయి.