ముగిసిన అంత్యక్రియలు

49 views

కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కోడి రామకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామకృష్ణకు పలువురు, సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. అక్కడ కొంత సేపు ఉంచిన తర్వాత కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని మహాప్రస్తానం స్మశాన వాటికకు తరలించారు. ఆయనకు కుమారులు లేక పోవడంతో కూతురు తీపిక చేతుల మీద అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ అభిమాన దర్శకుడి కడసారి చూపుకోసం పలువురు అభిమానులు, ప్రముఖులు తరలి వచ్చారు.