NewsOrbit
సినిమా

తెలుగు సినిమా సంచలనం.. ‘శివ’కు 31 ఏళ్లు..

tollywood game changer shiva completes 31 years

‘రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా తీస్తున్నాం.. ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.. ఇటువంటి కథ ముందెప్పుడూ రాలేదు’.. అంటూ పరిశ్రమలో మాటలు వినిపిస్తాయి. ప్రతి సినిమాను కొత్తగా తెరకెక్కించాలని భావిస్తారు దర్శకులు. అయితే.. కొన్ని సినిమాలు మాత్రమే ఆ తరహా మ్యాజిక్ చేస్తాయి. ఏకంగా పరిశ్రమ గమనాన్నే మర్చే శక్తి వాటికి ఉంటుంది. అటువంటి సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచే సినిమా ‘శివ’. 1989 అక్టోవర్ 5న విడుదలైన ఈ సినిమా నేటితో 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమాలు రికార్డులతో చరిత్ర సృష్టిస్తాయి.. కానీ ఈ సినిమాకే ఓ చరిత్ర ఉంది.

tollywood game changer shiva completes 31 years
tollywood game changer shiva completes 31 years

తెలుగు సినిమా పురుడు పోసుకున్నప్పటి నుంచీ రకరకాలుగా ఎదిగింది. ఈస్ట్ మన్ కలర్, సినిమా స్కోప్, యాక్షన్, ఫైట్స్, 70ఎమ్ఎమ్ సౌండ్.. ఇలా మారుతూ వచ్చింది. అయితే.. సినిమా మేకింగ్ లో మాత్రం మార్పు రాలేదు. ఆ లోటును తీర్చింది ‘శివ’. ఎవరూ ఊహించని విధంగా హాలీవుడ్ మేకింగ్, కెమెరా యాంగిల్స్, స్టడీ కామ్, స్లో డైలాగ్స్, నేరో మ్యూజిక్, ఫైట్స్.. ఇలా ప్రతి విభాగంలో కొత్తగా కనిపించింది శివ. దీనికి తోడు కాంటెంపరరీ కాలేజీ బ్యాక్ గ్రౌండ్, స్టూడెంట్ పాలిటిక్స్, రౌడీయిజం.. ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాయి. శివ సృష్టించిన సంచలనం కంటే.. మేకింగే లో మార్పే ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ఇన్నేళ్లయినా సినిమా మేకింగ్ గురించి ప్రస్తావన వస్తే ‘శివ’ సినిమా మాత్రమే గుర్తొస్తుందంటే ఈ సినిమా చేసిన మ్యాజిక్ లెవల్స్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని అద్భుతాలు చేసింది ఏ దిగ్దర్శుకుడు అనుకుంటే పొరపాటే. దర్శకత్వంలో పూర్తిగా మెళకువలు తెలియని ఓ కుర్రాడు.. ఇంతటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అతనే రామ్ గోపాల్ వర్మ. తొలి సినిమాతోనే సంచలనాలు రేపాడు. దేశం మొత్తం శివ వైపు చూసిందంటే అతిశయోక్తి కాదు. యూత్, కాలేజీ కుర్రకారు పిచ్చెక్కిపోయారు. సైకిల్ చైన్ ఫైట్ సినిమాకే హైలైట్. నాగార్జున స్టార్ హీరో అయిపోయాడు. కొత్త కుర్రాడ్ని నమ్మి నాగార్జున ఈ ప్రాజెక్టుకు ఓకే చేయడం ఓ సంచలనం.

 

author avatar
Muraliak

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar