Chiranjeevi Birthday: టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవి బర్త్ డే స్పెషల్..!!

Share

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి నేడు 66 వ యేట లో అడుగుపెట్టారు. ఇండస్ట్రీలో ఎవరి అండ లేకుండా స్వయంకృషితో శిఖరాలను అందుకున్నారు. తానొక్కడే విజయం సాధించడం మాత్రమే కాక తన ఫ్యామిలీలో అనేక మందికి లైఫ్ ఇచ్చిన లెజెండ్ చిరంజీవి. తెలుగు సినిమా రంగంలో అప్పటికే పెద్ద తలకాయలుగా ఉండే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి వారు ఉన్న వాళ్ళ వారసులు …రాణిస్తున్న  గాని.. ఎవరి అండా లేకుండా.. వాళ్ల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనం అధిరోహించిన వ్యక్తి చిరంజీవి. ఇండస్ట్రీకి అప్పట్లో సరికొత్త స్టెప్పులతో… కొత్త కొత్త స్టాంట్ ఫైటింగ్ లని పరిచయం చేసి… తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని చిరంజీవి అందించడం జరిగింది. ఎంతో సక్సెస్ సాధించడం జరిగింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా చిరంజీవి హిస్టరీ క్రియేట్ చేశారు. ఎన్నో విజయాలు సాధిస్తున్నే.. ఎంత ఎదిగినా గాని ఒదిగి ఉంటూ.. ఇండస్ట్రీలో మహామహుల చేత శభాష్ అనిపించుకున్న వ్యక్తి.

HBDMegastarChiranjeevi | Happy Birthday Chiranjeevi: Fans pour in heartfelt wishes for the megastar

నటన పరంగా.. కామెడీ పరంగా.. డాన్స్ ఇంకా ఫైట్స్ వరంగా… అన్ని రకాలుగా ఆల్ రౌండర్ అనిపించుకున్న వ్యక్తి. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేస్తూ… వెండితెరపై తనదైన శైలిలో రక్తికట్టించే చిరంజీవి.. కెరియర్లో స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఖైదీ, రుద్రవీణ, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, ఠాగూర్ ఇంకా చాలా సినిమాలు చిరంజీవి కెరీర్ లో హైలెట్ గా నిలిచాయి. రుద్రవీణ సినిమా కి నేషనల్ అవార్డు రావడం జరిగింది. సినిమాల పరంగా మాత్రమే కాక రాజకీయ పరంగా కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆశించిన స్థాయిలో రాజకీయాల్లో రాణించలేక పోయినా కానీ ఎక్కడా కూడా తనపై ఏటువంటి అవినీతి మరక పడకుండా… 2009 ఎన్నికలలో మహామహులు ఉన్న టైంలో.. పొలిటికల్ గా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేశారు. నిస్వార్ధంగా ప్రజలకు ఆయన చేసిన సేవలకు భారత్ ప్రభుత్వం నుండి పద్మ  భూషణ్ అవార్డు కూడా అందుకోవటం జరిగింది.

HBD Chiranjeevi : ప్రాణం ఖరీదు టూ గాడ్ ఫాదర్ వయా ఆచార్య వరకు మెగాస్టార్ సినీ ప్రస్థానం..

సమాజంలో అనేకమందికి హెల్ప్ చేసినా చిరు :-

వెండితెరపై ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాక సామాజికంగా ప్రజలను ఆదుకునే విషయంలో కూడా చిరంజీవి ఎప్పుడు ముందు ఉంటూనే ఉంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు తో పాటు ఇటీవల కరోనా వచ్చిన సమయంలో.. రెండు తెలుగు రాష్ట్రాలలో… ప్రతి జిల్లాలో ఆక్సిజన్ సిలిండర్ లు అందుబాటులోకి తీసుకువచ్చి కరోనా రోగులకు ప్రాణం పోశారు. అంత మాత్రమే కాక ఇండస్ట్రీ కి పెద్దగా వ్యవహరిస్తూ.. ఇండస్ట్రీ కార్మికులకు కరోనా లాక్డౌన్ టైంలో… నిత్యవసర వస్తువులు అందించడంతో పాటు… ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించటం జరిగింది. కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి తనతోపాటు ఉన్న హీరోలను ఏకంచేసి వారి దగ్గర విరాళాలు సేకరించి… సినీ ఇండస్ట్రీ ని నమ్ముకుని బతుకుతున్న కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.

ఫామిలీ మెంబెర్స్ కి లైఫ్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ :-

ఈ రీతిలో ఇండస్ట్రీలో మేలు చేస్తూ మరో పక్క సమాజంలో ప్రజలను ఆదుకుంటూ ఉన్న చిరంజీవి… తన క్రేజ్ ఆధారంగా తన ఫ్యామిలీలో అనేకమందికి లైఫ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్… ఇలా చాలా మంది ప్రముఖ హీరోల ను… తెలుగు ఇండస్ట్రీకి అందించారు. చిరంజీవి అంత కాకపోయినా గానీ ఆ తరహాలో రాణిస్తున్న ఈ హీరోలు… ప్రస్తుత తరాన్ని ప్రభావితం చేస్తున్నారు అంటే దానికి కారణం ఆయనే. ఎన్ని రకాలుగా చూసిన చిరంజీవి ప్రజలకు సహాయం చేస్తూ వారిని అలరిస్తూ.. రాజకీయాల నుండి మళ్లీ సినిమారంగంలో రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల స్పీడ్ కు తగ్గట్టు… అనేక సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి త్వరలోనే మరికొన్ని సినిమాల షూటింగ్ లను మొదలు పెట్టనున్నారు. ఇండస్ట్రీలో ఒక్కడిగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. స్వయంకృషితో శిఖరాలను అందుకుని రాజకీయంగా సామాజికంగా ఇండస్ట్రీ పరంగా… ఎవరు అందుకోలేని శిఖరాలను అందుకుని అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. అటువంటి చిరంజీవి బర్తడే ఈ రోజు కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా అభిమానులు… బాస్ బర్తడే సంబరాలు అంబరాన్ని అంటేలా.. చేస్తున్నారు.


Share

Related posts

Krishna  Dccb : కృష్ణ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్

bharani jella

Jabardasth Varsha : నీకంత సీన్ లేదమ్మా? స్టేజ్ మీదే జబర్దస్త్ వర్ష పరువు తీసేసిన హైపర్ ఆది?

Varun G

గ్రామ వాలంటీర్ల తొల‌గింపుః అస‌లు విష‌యం తెలిస్తే షాక‌వుతారు

sridhar