న్యూస్ సినిమా

Tollywood: పెళ్లయిన తర్వాత రెండోసారి సినిమా చేయడానికి రెడీ అవుతున్న హిట్ పెయిర్..??

Share

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్ జంటలు చాలానే ఉన్నాయి. అయితే ఈ రీతిలో పేరు సంపాదించిన ఓ జంట నిజజీవితంలో ఒకటవడం జరిగింది. ఆ జంట మరెవరో కాదు నాగచైతన్య, సమంత. ఇద్దరు కలిసి ఇండస్ట్రీలో నాలుగు సినిమాలు చేస్తే అందులో మూడు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. “ఏం మాయ చేశావే” సినిమాతో స్టార్ట్ అయినా వీరిద్దరి ప్రయాణం ఇండస్ట్రీలో తిరుగులేని పాపులారిటీ వచ్చేలా చేసింది. “ఏం మాయ చేసావే” మొదటి విజయం కాగా రెండోది “మనం” సినిమాతో  సూపర్ డూపర్ హిట్ సాధించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చేసుకోవడం జరిగింది. కాగా ఆ టైం లో ఫుల్ ప్లాప్ లలో ఉన్న నాగచైతన్య “మజిలీ” సినిమా లో సమంత ని తన పక్కన పెట్టుకుని హిట్ కొట్టాడు.

Rexona - Samantha & Naga Chaitanya - YouTube

పెళ్లి చేసుకున్న తర్వాత చాలావరకు వీరిద్దరు ఎవరికివారు తమ సినిమాలలో బిజీ అయ్యారు.  పెళ్లయిన తర్వాత సమంత ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూన్నే భర్త నాగచైతన్య సినిమాలపై దృష్టి పెట్టింది. చైతూకి క్రేజ్ తీసుకురావడంలో ఛాన్స్ దొరికినప్పుడల్లా నటించడానికి సమంత రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మరోసారి జత కట్టడానికి సిద్ధమయ్యారు.

 

విషయంలోకి వెళితే “సోగ్గాడే చిన్నినాయన” సినిమా సీక్వెల్ “బంగారు రాజు”” లో చైతు, అఖిల్ నటిస్తారని టాక్.  ఈనేపథ్యంలో సినిమాలో చైతు పక్కన హీరోయిన్ పాత్ర సమంతతో చేయించాలని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అనుకుంటున్నట్లు ఫిలిం వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్లు అంతా ఓకే అయితే నాగచైతన్యతో ఐదోసారి సమంత నటించడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Related posts

Today Horoscope డిసెంబర్ 23rd బుధవారం రాశి ఫలాలు

Sree matha

జబర్దస్త్ వర్ష.. ఇమ్మాన్యుయేల్ కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతోందట.. ఎందుకని?

Varun G

YS Sharmila: షర్మిల ఏమాత్రం తగ్గడం లేదుగా!మళ్లీ కేసీఆర్ పై గరం గరం!!

Yandamuri