Jamuna: తెలుగు సినీ లోకాన్ని ఉర్రుతలుగించిన సీనియర్ నటి జమున టాలీవుడ్ ను శోక సంద్రంలో మంచి వెళ్ళిపోయారు.. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో వివిధ పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు..

1936 ఆగస్టు 30న హంపిలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు . ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ కు జమున పార్థివదేహాన్ని తీసుకురానున్నారు . సత్యభామ పాత్ర ఆమెకు గుర్తింపును తీసుకొచ్చింది. వృద్ధాప్యం తాలూకు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సినీనటి జమున నేడు తుది శ్వాస విడిచారు. జమున తెలుగులో 150 పైకి సినిమాలలో నటించారు.
మిస్సమ్మ సినిమాతో జమునకు మంచి గుర్తింపు వచ్చింది. మిస్సమ్మ , చిరంజీవులు ,తెనాలి రామకృష్ణుడు , దొంగరాముడు, బంగారు పాప, భూకైలాస్, గుండమ్మ కథ , భాగ్యరేఖ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 1964, 1968లో ఉత్తమ సహాయ నటి అవార్డులు వచ్చాయి. సినిమాలలోనే కాదు రాజకీయాల్లో జమున కీలకపాత్ర పోషించింది. .1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాయచోమండ్రీ నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యారు. దివంగత ఇందిరాగాంధీ పట్ల అభిమానం గౌరవంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయంగా జమున పని చేశారు.