Tollywood: కరోనా రెండో దశ దేశాన్ని ఊపేస్తోంది. రాష్ట్రాలను కూడా అతలాకుతలం చేస్తుంది. అన్ని రంగాలను నాశనం చేస్తుంది. రవాణా, పారిశ్రామిక, తయారీ.., ఆహార రంగాలతో పాటూ సినీ పరిశ్రమపై కూడా దెబ్బ గట్టిగానే ఉంది. కరోనా రెండో దశ లేకుంటే ఇప్పటికే తెలుగు సినిమాలు హడావిడి ఎక్కువగా ఉండేది. ఈ నెలలో కొరటాల శివ – చిరంజీవి కాంబినేషన్ లోని “ఆచార్య” సినిమా వచ్చేసేది.. ఇది ఆగిపోయింది. ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో పాటూ మరో 20 సినిమాల వరకు ఆగిపోయినట్టే. వాటి జాబితా.. అవి ఎప్పుడు రిలీజ్ చేయాలనుకున్నారు అనేది ఓ సారి చూద్దాం..
Tollywood: ఈ 20 కాకుండా ఎన్నో..!?
ఖిలాడీ, బోయపాటి బాలయ్య మూడో సినిమా ఈ నెల 28 న విడుదల కావాల్సి ఉంది. గుడ్ లక్ సఖి, రిపబ్లిక్, 83 , రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రౌడీ బాయ్స్ సినిమాలు జూన్ లో విడుదల కావాల్సి ఉంది. మేజర్, కేజీఎఫ్ చాఫ్టర్ 2 , రాధే శ్యామ్, ఘనీ సినిమాలు జులై నెలలు రిలీజ్ కావాల్సి ఉంది. పుష్ప, మహా సముద్రం, ఎఫ్ 3 , లైగర్ , ఆర్ ఆర్ ఆర్ .. సినిమాలు వాయిదా పడినట్టే. వీటిలో పెద్ద సినిమాలు ఈ ఏడాది దసరాకి లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లిపోనున్నాయి. అంటే అప్పటికే సంక్రాంతికి రిలీజ్ అని ప్రణాళిక వేసుకున్న కొన్ని సినిమాలు వేసవికి వెళ్లిపోనున్నాయి. ఇలా సినిమాల వాయిదాతో సినీ పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి కరువవుతుంది.