Unstoppable 2: నటసింహం నందమూరి బాలయ్య బాబు ఫస్ట్ టైం హోస్ట్ గా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ‘అన్ స్టాపబుల్’ టాకీ షో అనేక సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ మొదటి సీజన్ దేశంలో టాప్ ప్రపంచంలో అన్ని టాకీ షోలలో టాప్ 10 లో ఒకటిగా నిలిచింది. మీ షోలో బాలకృష్ణలో హోస్ట్ గా మరో కోణం.. ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. షోకి వచ్చే అతిథిలతో… బాలకృష్ణ వ్యవహరించే తీరు ఆడియన్స్ ని అంతగానో ఆకట్టుకుంటూ ఉంది.
వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ కి సంబంధించిన విషయాలు.. కాంట్రవర్సీ ప్రశ్నలు చాలా కామెడీ తరహాలో వచ్చే గెస్ట్ మనసు నొప్పించకుండా అద్భుతంగా బాలకృష్ణ జవాబులు రాబడటం విశేషం. ఈ క్రమంలో సెకండ్ సీజన్ కి చంద్రబాబు ఇంకా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాజకీయ నాయకులు రావడంతో పాటు ఇండస్ట్రీలో కుర్ర హీరోలు రావటంతో..’అన్ స్టాపబుల్ 2′ మరింత హైలెట్ గా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ లో లెజెండరీ దర్శకులు… మరియు నిర్మాతలతో ప్లాన్ చేశారు. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, సురేష్ బాబు, అల్లు అరవింద్ ఈ షో కి వచ్చారు.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా రంగంలో దర్శకునిగా రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు… ఇండస్ట్రీ హిట్ లు అందుకోవటం తెలిసిందే. నిర్మాతలగా సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ కూడా.. సక్సెస్ అయిన ప్రొడ్యూసర్స్. ఇండస్ట్రీలో ఈ నలుగురు ప్రముఖులను ఒకే వేదికపై..’అన్ స్టాపబుల్ 2′ నాలుగో ఎపిసోడ్ లో చూడనున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!