NewsOrbit
Entertainment News సినిమా

Rajamouli: రాజమౌళి అన్న ఈ ఒక్క మాటతో ప్రభాస్, అల్లూ అర్జున్, ఎన్టీఆర్ .. అందరికీ భయం పట్టుకుంది !

Advertisements
Share

Rajamouli: దిగ్గజ దర్శకుడు రాజమౌళి బాహుబలి, RRR సినిమాలతో భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ శిఖరాగ్రస్థాయికి చేర్చడం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు వసూలు సాధించి పెట్టిన ఘనత అందుకున్న దర్శకుడిగా రాజమౌళి పేరు సంపాదించారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు రాజమౌళితో సినిమాలు చేయడానికి ఎంతోమంది స్టార్ హీరోలు పలు నిర్మాణ సంస్థలు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో సృష్టించిన రికార్డులు.. రాజమౌళికి భారతీయ చలనచిత్ర రంగానికి మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రపంచ సినీ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ కూడా గెలవడంతో రాజమౌళి క్రేజ్ ప్రపంచ స్థాయిలో ఓ రేంజ్ లో ఉంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థలు సైతం రాజమౌళితో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

Advertisements

Tollywood's top heroes are scared to hear Rajamouli's words about Mahesh's film

ఇదిలా ఉంటే అందరూ రాజమౌళి వెంట పడుతుంటే మరోపక్క ఆయన మాత్రం తమిళ సినిమా రంగంలో ఓ హీరోతో చేయాలని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. ఆయన మరెవరో కాదు హీరో సూర్య. చాలా కాలం క్రితం నుండే సూర్యతో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు రాజమౌళి వాళ్ళ ఇంటర్వ్యూలలో తెలిపారు. కానీ సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఫైనల్ కి చేరుకున్నట్లు రాజాగా వినపడుతున్న సమాచారం. ఈ సినిమా RRR బడ్జెట్ కంటే ఎక్కువ అని సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అంతేకాదు విభిన్నమైన అడ్వెంచర్ కాన్సెప్ట్ తో వరల్డ్ మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకుని రాజమౌళి తీయబోతున్నారట. మహేష్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రప్పించబోతున్నారట. దాదాపు 1,000 కోట్ల బడ్జెట్ తో.. దేశంలో ప్రపంచంలో పేరుగాంచిన పలు భాషలలో విడుదల చేసే రీతిలో ప్లాన్ చేస్తున్నారట.

Advertisements

Tollywood's top heroes are scared to hear Rajamouli's words about Mahesh's film

స్వయంగా ఈ విషయాన్ని రాజమౌళి ఇటీవల ఇండస్ట్రీలో కొంతమంది పెద్దల వద్ద కన్ఫామ్ చేశారట. రాజమౌళి అన్న ఈ ఒక్క మాటతో ఇప్పుడు ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి భయం పట్టుకున్నట్లు సమాచారం. ఎందుకంటే సీన్ కరెక్ట్ గా వచ్చేవరకు కాంప్రమైజ్ కానీ డైరెక్టర్ రాజమౌళి అని అందరికీ తెలుసు. ఇక ఇదేదోరణిలో దర్శకుడికి మంచి అవుట్ పుట్ ఇవ్వటంలో ఎంత కష్టానైనా ఎదుర్కొనే హీరో మహేష్ బాబు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ నీ టార్గెట్ చేసుకుని అందులోనూ 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా చేస్తూ ఉండటంతో.. ఇప్పటివరకు తమ పేరిట రికార్డులు ఉన్నాయని గొప్పగా ఫీల్ అవుతున్న హీరోలకి భయం పట్టుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


Share
Advertisements

Related posts

Vijay Deverakonda: మరోసారి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నీ రిపీట్ చేస్తున్న విజయ్ దేవరకొండ..?

sekhar

వర్మ తర్వాత సినిమా ఏంటో చూడండి…! ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేశాడు..!

sekhar

Mugguru Monagallu: ముగ్గురు మొనగాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్..!!

bharani jella