RRR: హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటించిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టామ్ క్రూజ్ “మిషన్ ఇంపాజిబుల్” సినిమా ప్రపంచవ్యాప్తంగా … భారీ బ్లాక్ బస్టర్ అవటం మాత్రమే కాక .. తిరుగులేని రికార్డులు సాధించింది. కాగా ఇటువంటి హీరో ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విషయంలోకి వెళితే “బాహుబలి” తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “RRR” మార్చి 25 వ తారీకు విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మార్చి మొదటి తారీకు నుండి మళ్లీ విడత ప్రమోషన్ కార్యక్రమాలు జరిపించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఇప్పటికే బాలీవుడ్ అదేవిధంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో తమిళం మరియు మలయాళం లో RRR వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఇప్పుడు దుబాయ్ లో అతి భారీ రిలీజ్ వేడుక జరిపించి ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు..ఈ సందర్భంగా హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ నీ ముఖ్యఅతిథిగా తీసుకురావటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో టాలీవుడ్ హీరోలు ఇండియాల సినిమాలకు చీఫ్ గెస్ట్ లుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ఐ సినిమా కి.. ఆర్నాల్డ్, దశావతారం సినిమాకి జాకీ చాన్.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో RRR సినిమా కోసం హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ నీ తీసుకొచ్చే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “బాహుబలి” తో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా చాటడంతో.. రాజమౌళి ఈ హాలీవుడ్ హీరోని RRRకి మరింత ఇంటర్ నేషనల్ గ్లామర్ వచ్చేలా వాడుకుంటున్నట్లు సమాచారం.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…