NewsOrbit
Entertainment News సినిమా

BRO: రేపే పవన్ కళ్యాణ్ “BRO” టీజర్ విడుదల..!!

Advertisements
Share

BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో చేసిన చిత్రం “BRO”. తమిళంలో “వినోదయ సీతమ్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కటం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రేపు అనగా జూన్ 29వ తారీకు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. తమిళంలో “వినోదయ సీతమ్”లో నటించిన సముద్రఖని ఈ సినిమా తెలుగు వర్షన్ కి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాకి “బ్రో… ది అవతార్” అనే టైటిల్ ఖరారు చేయడం జరిగింది.

Advertisements

tomorrow pawan kalyan bro teaser release official announcement

జులై 28వ తారీకు ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. తమన్ మ్యూజిక్ అందించడం జరిగింది. కలెక్షన్ల పరంగా “బ్రో” రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరఫున వారహి విజయ యాత్ర చేస్తున్నారు. జూన్ 14 వ తారీకు నుండి ఉదయ గోదావరి జిల్లాలలో సాగుతున్న ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొంటూ ఉన్నారు. అయితే భీమవరం చేరుకునేసరికి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడం జరిగింది.

Advertisements

tomorrow pawan kalyan bro teaser release official announcement

తీవ్ర జ్వరానికి గురికావడంతో రెండు రోజులపాటు విరామం తీసుకోవాలని వైద్యులు తెలియజేయడంతో… ఈ క్రమంలో “బ్రో” సినిమాకి పవన్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఒకపక్క రాజకీయంగా బిజీగానే ఉంటూ మరోపక్క సినిమా ప్రాజెక్టులను కూడా పవన్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం మెగా హీరోతో కలిసి మల్టీస్టారర్ చేసిన ప్రాజెక్టు కావడంతో “బ్రో” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి స్టిల్స్ “తమ్ముడు” సినిమాలోవి తలపిస్తూ ఉండటంతో… అంచనాలు ఉన్న కొద్ది పెరుగుతూ ఉన్నాయి.


Share
Advertisements

Related posts

`ప్రాజెక్ట్ కె`కు రెండు రిలీజ్ డేట్స్‌.. ప్ర‌భాస్ ఎప్పుడు వ‌స్తాడో?

kavya N

Bheemla Naayak: “బీమ్లా నాయక్” మిస్ చేసుకున్న యంగ్ డైరెక్టర్..??

sekhar

త‌ల్లి కాబోతున్న నిహారిక‌.. మెగా వార‌సుడు వ‌స్తున్నాడ‌ట‌.

kavya N