KGF 2: సౌత్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత కేజీఎఫ్ ఛాప్టర్ 1తో వచ్చిన ప్రశాంత్ నీల్ – యష్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తరువాత ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తో రాబోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో కేజీఎఫ్ 2 చిత్రానికి అంతే క్రేజ్ ఉండటం విశేషం. కన్నడ స్టార్ యష్ రాఖీభాయ్ గా తన అద్భుతమైన నటనను సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు రెడీ అయ్యారు. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ ఏడాది రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ తుఫాన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. గత ఏడాది చిత్ర హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా వదిలిన టీజర్ కేజీఎఫ్ 2 సినిమాపై అంచనాల్ని అసాధారణంగా పెంచేసింది. కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో కట్ చేసిన ఈ టీజర్ కొత్త రికార్డులను సృష్ఠించింది. మళ్ళీ అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్‌లో భాగంగా నటీ నటులు డబ్బింగ్ చెబుతున్న అప్డేట్స్ ఇచ్చారు తప్ప ఫస్ట్ సాంగ్ గురించి మాత్రం ఇప్పటి వరకు అప్డేట్స్ ఇవ్వలేదు. దీని కోసమే ఇన్నాళ్ళుగా అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూశారు.
KGF 2: మళ్ళీ ఈ సాంగ్ వదిలి తారా స్థాయికి తీసుకెళ్ళారు.
ఇప్పుడు ఆ సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ప్రమోషన్స్‌లో భాగంగా తూఫాన్ తూపాన్ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను వదిలారు. ఈ సాంగ్ రిలీజైన కొద్ది సేపట్లోనే యూట్యూబ్‌లో సంచలనం సృష్ఠిస్తూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటి వరకు కాస్త అంచనాలు సన్నగిల్లిన అభిమానుల్లో మళ్ళీ ఈ సాంగ్ వదిలి తారా స్థాయికి తీసుకెళ్ళారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా ఈ నెలలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.