Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక బాలీవుడ్ ఇంకా దేశంలో అనేక ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోలు రాజమౌళితో కచ్చితంగా సినిమా చేయాలని ప్రతి ఒక్కరి డ్రీమ్. “బాహుబలి” సినిమా విజయంతో దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమ్రోగింది. “బాహుబలి” రాకముందు ఒక టైంలో ప్రపంచ సిని ప్రేమికులు ఇండియా గురించి మాట్లాడాల్సి వస్తే మొదట బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే పరిస్థితి. కానీ ఎప్పుడైతే “బాహుబలి” రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో…ప్రజంట్ రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు.
అయినా కానీ “బాహుబలి” విజయం తర్వాత వేరే ఇండస్ట్రీ హీరో లకు పెద్దగా అవకాశం ఇవ్వకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన హీరోలతోనే జక్కన్న సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ చాలా వరకు క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 13న సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. పరిస్థితి ఇలా ఉండగా.. ఈ సినిమా తర్వాత మహేష్ తో రాజమౌళి సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజమౌళి కోసం ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న “సర్కార్ వారి పాట” సినిమా.. షూటింగ్ స్పీడ్ పెంచడం జరిగిందట. చాలా త్వరగా సర్కారీ వారి పాట సినిమా… కంప్లీట్ చేసి.. రాజమౌళి సినిమా చేయాలని మహేష్ ప్లాన్ వేస్తున్నారట. అంతే కాకుండా రాజమౌళి సినిమా అంటే మినిమం ఏడాది టైం పట్టే అవకాశం ఉండటంతో.. మధ్యలో త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు టాక్. ఇదిలా ఉంటే వరుసగా మహేష్ బాబు టాప్ డైరెక్టర్లను లైన్లో పెట్టడంతో ..మహేష్ రాబోవు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించటం గ్యారెంటీ అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.