పెళ్లయిన 12 రోజులకే కట్టుకున్న వాడిని జైల్లో పెట్టించిన టాప్ హీరోయిన్..??

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ గా పేరొందిన వారిలో పూనంపాండే ఒకరు. సినిమాల్లో కన్న వివాదాల్లో ఈ బాలీవుడ్ బ్యూటీ పూనంపాండే గురించి వార్తలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. అప్పట్లో ఇండియన్ టీం వరల్డ్ కస్తే గ్రౌండ్ లో నగ్నంగా పరిగెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి పాపులర్ అయిన ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో ఉన్నారు.

Poonam Pandey gets husband Sam Bombay arrested for assault days after their  marriage | Celebrities News – India TVఇదే తరుణంలో తన సొంత యాప్ లో పెట్టే అడల్ట్ కంటెంట్ తో గట్టిగానే సంపాదిస్తున్నారు. అటువంటి ఈ బోల్డ్ బ్యూటీ గత కొద్ది రోజుల క్రితమే తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ సమ్ బొంబాయి నీ పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం నుండి సహజీవనం చేస్తున్న వీరు సెప్టెంబర్ పదవ తారీఖున అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా పెళ్లయిన 12 రోజులకే భర్త తనను వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది పూనం. లైంగికంగా వేధించడం తో పాటు తనపై దాడి కూడా చేసినట్లు పూనం భర్తపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది.

 

దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పూనం పాండే భర్త సమ్ బొంబాయి నీ అదుపులోకి తీసుకున్నారు. యాడ్ మేకర్ అయిన సమ్ బొంబాయి అరబ్ ఎమిరేట్స్ లో పుట్టి పెరిగారు. బాలీవుడ్ టాప్ స్టార్స్ రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే లాంటి వారితో యాడ్స్ చేశారు. ఈ క్రమంలో ఓ యాడ్ చిత్రీకరణ సమయంలో పూనం తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడం జరిగింది.