పడుకునే ముందు చెక్ చేసుకోవడానికి నేటి టాప్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్‌లు మీకోసం న్యూస్ ఆర్బిట్ నుండి: ఇవి న్యూస్ ఆర్బిట్ రచయతలు రాసిన నేటి తెలుగు సినిమా మరియు ఎంటర్టైన్మెంట్ న్యూస్ నుండి తీసుకోబడింది.
సెప్టెంబర్ 12, 2022: ఇక నేటి టాప్ ఎంటర్టైన్మెంట్ మరియు తెలుగు సినిమా అప్‌డేట్‌లు ఇవే
`ఒకే ఒక జీవితం` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. శర్వా దుమ్ము దులిపేశాడు!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలను పోషించారు. Read more
విమర్శకుల చెంప చెళ్లుమనిపించిన అల్లు అర్జున్.. దెబ్బకి నోళ్లు మూతపడ్డాయిగా!!
అల్లు అర్జున్‌ను మెగా అభిమానులు తరచుగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఏ చిన్న సందు దొరికినా అతడిపై విరుచుకుపడటానికి వీరు ముందుంటారు. అయితే ఇప్పుడు బన్నీ కృష్ణంరాజు మరణంపై ట్వీట్ చేయలేదని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సెప్టెంబర్ 11న టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన అంతిమ యాత్ర కొనసాగుతోంది. అంతకంటే ముందు అతని భౌతికకాయానికి మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, చిరంజీవి వంటి పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. కృష్ణంరాజు కుటుంబాన్ని, ప్రభాస్‌ను ఓదార్చుతూ తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.Read more…
బాక్షాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోన్న బ్రహ్మాస్త్ర… మూడురోజుల్లో ఏకంగా అన్నీకొట్లా?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ – రణబీర్ కపూర్ జంటగా రూపొందిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో తెలుగులో విడుదల చేయడం జరిగింది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తూ విడుదల చేశారు. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే సినిమాకు వసూళ్ల వర్షం కురవడం కొసమెరుపు.Read more…
రామ్ చరణ్ ని తిట్టిపోస్తున్న కన్నడ ఫ్యాన్స్… ఎందుకంటే?
సాధారణంగా ఏ భాష డైరక్టర్ అయినా మొదట తమ సినిమా పరిశ్రమలోని హిట్ కొట్టి వేరే భాషా హీరోలను డైరక్ట్ చేద్దామనుకుంటాడు. ఎక్కువగా తమిళం నుంచి తెలుగులోకి అలా వస్తూంటారు. అక్కడ ఓ విజయం సాధించగానే తెలుగు హీరోకు కథ చెప్పి ఒప్పించాలనుకుంటారు. ఎందుకంటే, తెలుగు మార్కెట్ పెద్దది కావటం.. రెమ్యునరేషన్స్ , సినిమా బడ్జెట్ లు ఎక్కువగా ఉంటాయి కనుక. అయితే ఇప్పుడు కన్నడ దర్శకులు కూడా మనవైపు చూస్తున్నారు. KGF సూపర్ హిట్ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇక్కడ ప్రభాస్, NTRలతో ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. తర్వాత రామ్ చరణ్ అని అంటున్నారు. Read more…

₹1000 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్యతో సినిమా చేయడానికి రెడీ అయిన శంకర్
ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు వస్తూ ఉన్నాయి. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలే చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ తరహాలో RRR, బాహుబలి 2, కేజిఎఫ్ సినిమాలు అనేక రికార్డులు సృష్టించటం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ₹1000 కోట్ల భారీ బడ్జెట్ తో హీరో సూర్యతో డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
కృష్ణంరాజు తన మరణం ఎలా ఉండాలనుకున్నారో తెలుసా?
రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) ఇక లేరన్న సంగతి తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కృష్ణం రాజు ఆకస్మిక మరణం తెలుగు సినీ పరిశ్రమకు విషాదంలోకి నెట్టేసింది. Read more…