సినిమా సబ్జెక్టు బాగోలేదని లేదా ప్లానింగ్ సరిగా లేదనే కారణాలు చూపుతూ కొందరు స్టార్ హీరోలు తమ కొత్త సినిమా షూటింగ్‌లను నెలల కొద్దీ వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా సినిమాలు త్వరగా స్టార్ట్ చేయకపోతే సినీ కార్మికులకు ఉపాధి దొరకక చాలా ఇబ్బందులు పడతారని చెప్పవచ్చు. అభిమానులు కూడా సినిమా లేట్ అవుతున్నందుకు తీవ్ర నిరాశకు గురవుతారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు తప్ప స్టార్ హీరోలందరూ తమ తదుపరి సినిమాలతో బిజీ అయిపోయారు. ఆ ముగ్గురు స్టార్స్ మాత్రం తమ నెక్స్ట్ సినిమాలు ఇంకా మొదలెట్టనే లేదు.
అల్లు అర్జున్
వారిలో అల్లు అర్జున్ ఒకడు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించిన బన్నీ ఇప్పుడు పుష్ప 2 సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఇంకా పట్టాల మీదకు వెళ్లలేదు. ఎందుకంటే మూవీ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 సినిమా కథను ఇంకా ఫినిష్ చేయలేదు. మరి సినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తారో ఎవరికీ తెలియడం లేదు. మూవీ యూనిట్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. బన్నీ అయినా సుకుమార్‌ని కాస్త తొందర పెట్టి కథను త్వరగా పూర్తి చేసేలా బలవంతం చేస్తున్నాడో లేదో! ఈ సినిమా కోసం మాత్రం దేశవ్యాప్తంగా చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి కనీసం ఏడాది సమయం పడుతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 2024లో రిలీజ్ కావచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తారక్
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఆ కాంబో కూడా ముందు పడటం లేదు. ఆచార్య సినిమా వల్ల తలెత్తిన కొన్ని ఇబ్బందులు దాదాపు కొరటాల శివకు తీరిపోయినట్టే. అయినా కూడా సినిమా షూటింగ్ కాస్ట్ చాట్ చేయడం లేదదు. నెక్స్ట్ తారక్ మూవీ పని మీదే ఉన్నాడా లేక ఫైనల్ వర్షన్ సిద్ధం చేశాడా అనే విషయం ప్రశ్నార్థకం గా మిగిలిపోయింది.
మహేష్ బాబు
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబో మూవీ సెప్టెంబర్ నుంచి షూటింగ్ జరుపుకోనుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. మహేష్ బాబు హాలిడే ట్రిప్ నుంచి ఇంటికి రాగానే సినిమా లో స్టార్ట్ చేస్తారు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇప్పటికైనా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ముగ్గురు సెట్స్‌లో అడుగుపెట్టి దాదాపు 6 నెలలు దాటింది. ఇదిలా ఉండగా ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చాక ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమా ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. మహేష్ బాబు గురించి వేరే చెప్పనవసరం లేదు. హడావుడి ఏం లేకుండా ఏడాదికి ఒక సినిమా చేస్తే చాలు అనుకుంటున్నాడు.