చెన్నై సొగసరి త్రిష సినిమాల్లోకి అడుగు పెట్టి 19 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా హీరోయిన్గా ఆమె క్రేజ్ ఇంకా తగ్గలేదు. కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడుతూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటుంది త్రిష. వచ్చే ఏడాది ఈమె ఏకంగా మూడు భారీ చిత్రాల్లో నటిస్తుంది. దీనిపై ఆమె ఓసందర్భంలో స్పందిస్తూ నాకు మలయాళ చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా మోహన్‌లాల్‌తో ఎప్పుడు నటిస్తామనే ప్రస్తావన వచ్చేది. ఇన్నేళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ఆయనతో కలిసి రామ్ అనే చిత్రంలో నటిస్తున్నానని త్రిష తెలిపారు. మోహన్‌లాల్, త్రిష కాంబినేషన్లో ౠదృశ్యంౠ పేమ్ జీతూ జోసెఫ్ రూపొందిస్తోన్న చిత్రం ‘రామ్’. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
previous post
next post