Trisha: హీరోయిన్ త్రిష అందరికీ సుపరిచితురాలే. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో రాణిస్తూ ఉంది. మొత్తం ఇప్పటివరకు 60 చిత్రాలకు పైగానే సినిమాలు చేయడం జరిగింది. దక్షిణాది చలనచిత్ర రంగంలో దాదాపు టాప్ హీరోలు అందరి సరసన నటించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇంకా చాలామంది హీరోలతో నటించింది. తెలుగులో త్రిష నటించిన వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కింగ్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, అతడు, బుజ్జిగాడు, కృష్ణ, నమో వెంకటేశా.
ఎక్కువగా ప్రభాస్, వెంకటేష్ మరియు మహేష్ బాబు లతో సినిమాలు చేయడం జరిగింది ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించింది. చేతినిండా సినిమాలతో దక్షిణాది చలనచిత్ర రంగంలో త్రిష ఓ వెలుగు వెలిగింది. దాదాపు 40 సంవత్సరాల వయసు కలిగిన త్రిష ఇప్పటివరకు మూడు సౌత్ ఫిలింఫేర్ అవార్డు అందుకోవటం జరిగింది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషలలో కూడా నటించడం జరిగింది. ఇటీవలే “పొన్నియన్ సెల్వన్” సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో త్రిష నిశ్చితార్థం జరగగా మళ్లీ అది క్యాన్సిల్ అయింది.
2015వ సంవత్సరంలో వరుణ్ మనియన్ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ జరగగా తర్వాత.. ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో పెళ్లి రద్దు చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ప్రముఖ మలయాళ నిర్మాత తో త్రిష పెళ్లికి రెడీ అయినట్లు సమాచారం. సినిమా వ్యాపారంతో పాటు బయట కూడా అనేక బిజినెస్ లు అతనికి ఉన్నట్లు కొన్ని వేల కోట్లు కలిగిన వ్యక్తిని త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.