Allu Arjun Trivikram: తెలుగు చలనచిత్ర రంగంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. మొదటి సినిమా జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, “అలా వైకుంఠపురం లో” మూడింటితో తిరుగులేని విజయాలు అందుకున్నారు. త్రివిక్రమ్ పంచ్ పవర్ కి బన్నీ టైమింగ్ తో పాటు డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటది. బన్నీ కెరియర్ పరంగా “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా”… సినిమా ఫ్లాప్ అయ్యాక దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉండటం జరిగింది. ఆ టైంలో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని బన్నీ ఎదుర్కోవటం జరిగింది.
అదే సమయంలో అనేక కథలు విన్న బన్నీ… త్రివిక్రమ్ దర్శకత్వంలో..”అలా వైకుంఠపురం లో” సినిమా చేసి అదిరిపోయే విజయాన్ని తన కెరియర్ లో అందుకున్నారు. 2020 ఏడాదిలో ఇండస్ట్రీ హిట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడూ మళ్లీ వీరిద్దరి కెరియర్ లో మరో సినిమా రాబోతున్నట్లు తాజాగా ఆహా టీం ప్రకటన చేయడం జరిగింది. కలిశారు మళ్లీ ఇద్దరూ ఇక రికార్డుల వేట మొదలు. వాళ్లు మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మరియు బన్నీ. అతిపెద్ద మూవీ పండుగ చేసుకుందాం గెట్ రెడీ ఫర్ సునామీ అని అధికారిక ప్రకటన చేయడం జరిగింది.
ప్రస్తుతం తరివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో “గుంటూరు కారం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరి నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. “పుష్ప 2” కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని కూడా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.