Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస పరాజయాలను మూట గట్టుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత ఆ స్థాయిలో పెద్దగా విజయ్ దేవరకొండ హిట్టు అందుకోలేకపోయాడు. దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” చేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదలయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా విడుదలకి ముందు ఇండియా షేక్ చేస్తామంటూ విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ పెద్దపెద్ద డైలాగులు చెప్పటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కానీ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో.. మొదటి షోకే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు విజయ్ దేవరకొండ కష్టపడ్డాడు. అయినా కానీ సినిమా పరాజయం పాలు కావడంతో అభిమానులు ఎంతో నిరోత్సాహం చెందారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పూరితో చేస్తున్న రెండో సినిమా “జనగణమన” కూడా ఆగిపోయింది. దీంతో విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం “ఖుషి” మాత్రమే మిగిలి ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండని ఆదుకోవడానికి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “ఖుషి” సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాకి త్రివిక్రమ్ స్టోరీ అందిస్తున్నారట. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ విజయం సాధిస్తాడేమో అని తాజా వార్త పై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.