NTR Trivikram: 2020లో “అలా వైకుంఠపురం లో” సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా రాలేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ మూడో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మహేష్ సినిమా పూర్తి అవ్వకముందే నెక్స్ట్ సినిమా తారక్ తో ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. గతంలోనే తారక్ తో “అరవింద సమేత వీర రాఘవ” అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమా ప్రకటించారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తారక్ ప్రస్తుతం తన 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ తో మరోసారి త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేయటం జరిగింది అంట. ఈ సినిమా పౌరాణిక చిత్రాన్ని తలపించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవరనాగ వంశీ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతూ… తారక్ తో భారీ బడ్జెట్ పౌరాణిక సినిమాని ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ మరియు తారక్ ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తి కాగానే ఈ భారీ బడ్జెట్ పౌరాణిక ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. దీంతో నాగ వంశి కామెంట్లపై ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ సినిమా పట్టాలెక్కితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. “RRR”తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని నటుడు అని అనిపించుకున్నారు. ఈ క్రమంలో స్టార్ దర్శకులు కొరటాల ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తూ ఉండటంతో రెండు విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.