Trivikram : టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు అని అందరికీ తెలుసు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన డైలాగులు మరియు పంచ్ టైమింగ్ హీరోకి తగ్గ రీతిలో వెండితెరపై పేలుతూ ఉంటాయి. ఆయన చేసిన సినిమాలు చాలా వరకూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టించాయి. గత ఏడాది అల్లుఅర్జున్ తో చేసిన “అల వైకుంఠపురంలో” సూపర్ డూపర్ హిట్ అయి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను అధిగమించడం జరిగింది. ఇదిలా ఉంటే యాడ్స్ పరంగా కూడా త్రివిక్రమ్ దూసుకుపోతున్నారు అట. ముంబాయికి చెందిన చాలా ప్రముఖ కంపెనీలు త్రివిక్రమ్ దర్శకత్వంలో యాడ్స్ చేయించుకుని రోజు కి 30 లక్షల రూపాయలు… ఇవ్వటానికి కూడా వెనుకాడటం లేదట.
సౌత్ ఇండియాలో ఏ డైరెక్టర్ కి లేని విధంగా యాడ్స్ పరంగా… త్రివిక్రమ్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ రాబడుతున్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన రెండు యాడ్స్ లో ఒకటి “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించగా , రెండవది త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం రెడీగా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో “RRR” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా 30 కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు అట. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సూపర్ డూపర్ హిట్ కావడంతో..రాబోయే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్. రాజమౌళితో చేసిన తర్వాత సినిమా కావడంతో స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట త్రివిక్రమ్.