SSMB 28: ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమా అప్ డేట్ కి సంబంధించి ఏదో ఒక వార్త తండ్రి కృష్ణ బర్తడే నాడు తెలియజేస్తూ ఉంటారు. గత ఏడాది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో భయంకరంగా కేసులు పెరగటంతో పాటు మరణాలు సంభవించిన పరిస్థితి ఉండటంతో… ఎటువంటి అప్డేట్ అవ్వలేదు. కానీ అంతకు ముందు సంవత్సరం సర్కారు వారి పాట సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం మాత్రమే కాదు త్రివిక్రమ్ సినిమా ప్రాజెక్టు ప్రకటన కూడా చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఈ ఏడాది ఇది కృష్ణ బర్తడే నాడు మే 31 వ తారీకు.. త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఎటువంటి అప్ డేట్ ఇవ్వక పోవటంతో ఫ్యాన్స్ ఫుల్ నిరుత్సాహం చెందడం జరిగింది. ఇదిలా ఉంటే ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆరోజు మాత్రం సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ చిన్నపాటి వీడియో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ లో ఉన్నారు. వచ్చిన వెంటనే విడుదల చేసే చిన్నపాటి వీడియో కి సంబంధించిన వర్క్.. ఈ సన్నివేశాలు చిత్రీకరించారని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ చిన్నపాటి వీడియో.. విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు మహేష్ లో ఉన్న కొత్త యాంగిల్ నటనను బయట పెట్టడం జరిగింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఏ రీతిగా ఉంటుందో అన్నది అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!