Trivikram Chiranjeevi: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకరు. తన మార్క్ పంచ్ డైలాగులతో.. మాటల రూపంలో వెండితెరపై కామెడీ పండించడంలో.. త్రివిక్రమ్ పెన్ పవర్ కి తిరుగులేదు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు అందరిని డైరెక్ట్ చేయడం జరిగింది. ఒక ప్రభాస్ మరియు రామ్ చరణ్ మినహా మిగతా హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నితిన్, నాగార్జున, వెంకటేష్ మరి కొంతమంది హీరోలతో సినిమాలు చేశారు. 25వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవితో “జై చిరంజీవ” అనే సినిమా చేయడం జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది.
అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆల్రెడీ చిరంజీవి గతంలో నటించిన హిట్ సినిమాని.. త్రివిక్రమ్ సీక్వెల్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు… చిరంజీవికి కెరియర్ ప్రారంభంలో మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ఖైదీ. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించడానికి త్రివిక్రమ్ రెడీ కావడం జరిగింది అంట. ఆల్రెడీ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినట్లు.. ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
పగ తీర్చుకోవటం కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరో జన్మ ఎత్తుతాను. అప్పుడు కలుసుకుందాం అనే డైలాగ్ నీ బెస్ చేసుకుని సినిమా చేయబోతున్నారట. ఆల్రెడీ చిరంజీవి తో చర్చలు జరిపినట్లు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా గానే చిరంజీవి తో చేయబోయే సెకండ్ సినిమా ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం జనవరి 12వ తారీకు విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటనన్న తాజాగా నిర్మాతలు ప్రకటించారు. అయితే చిరంజీవితో చేయబోయే ఖైదీ సీక్వెల్ కి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.