మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ ని ఫిక్స్ చేసేసిన త్రివిక్రమ్..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కాంబినేషన్ లలో మహేష్ బాబు– త్రివిక్రమ్ ఒక కాంబినేషన్. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన “అతడు” ఇప్పటికీ అందరిని మెస్మరైజ్ చేసే సినిమాగా టెలివిజన్ రంగాలలో టీఆర్పీ విషయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేసిన “ఖలేజా”…. మహేష్ లో ఉన్న కొత్త కామెడీ యాంగిల్ ని, పంచ్ జోనర్ నీ చూపించినట్లు అయింది. ఈ సినిమా తర్వాత మహేష్ చాలావరకు కొత్తదనంతో కామెడీ నేపథ్యంలో సినిమాలు చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించారు.

Srimanthudu Movie Stills - Photos,Images,Gallery - 22552ఇదిలా ఉండగా త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్నట్లు వార్తలు ఇటీవల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమాలో మహేష్ కోసం త్రివిక్రమ్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు సరికొత్త టాక్ వస్తుంది. పూర్తి విషయంలోకి వెళితే ఈ సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా శృతిహాసన్ నీ నటింపజేయడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో శృతిహాసన్ మహేష్ “శ్రీమంతుడు” చేసి అదిరిపోయే జంట అనిపించుకున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో స్టార్ హీరోయిన్స్ లో శృతి డేట్స్ ఎక్కువ ఉండటంతో త్రివిక్రమ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు టాక్.

“అలా వైకుంఠపురంలో” సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ ఏడాది స్టార్టింగ్ లో తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ప్రకటన చేయటం తెలిసిందే. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న “RRR” షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో…. ఈ లోపు మహేష్ తో త్రివిక్రమ్ అతి తక్కువ టైమ్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.